కుటుంబంలో ఆస్తి తగాదాలు.( Property Disputes ) పెద్దల పంచాయితీలో గ్రామస్తులందరి ముందు కొబ్బరి బొండాల కత్తితో వదినను దారుణంగా చంపేశాడు మరిది.
ఈ ఘటన తెలంగాణలోని హనుమకొండలో( Hanumakonda ) తీవ్ర కలకలం రేపింది.గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురై పోలీసులకు సమాచారం అందించారు.
అసలు హత్యకు గల కారణాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.అన్న చనిపోతే, ఆ కుటుంబానికి తోడుగా ఉండాల్సిన తమ్ముడు మొత్తం ఆస్తి తనకే దక్కాలనుకున్నాడు.
వదిన బతికి ఉండగా ఆస్తి మొత్తం చేతికి రావడం అసాధ్యం.పెద్దల సమక్షంలో పంచాయతీలో అందరి ముందు ఆమె ప్రాణాలు తీసేశాడు.
వివరాల్లోకెళితే.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో పురాణం జంపయ్య, స్వరూప (35) దంపతులు నివాసం ఉన్నారు.అయితే 2022 ఫిబ్రవరిలో పురాణం జంపయ్య ( Jampaiah ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.అప్పటినుంచి పురాణం జంపయ్య భార్య స్వరూపకు, జంపయ్య సోదరుడు సమ్మయ్యకు మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి.
అన్న ఆస్తి అన్న భార్యకు ఇవ్వడానికి సమ్మయ్యకు ఇష్టం లేదు.

దీంతో సమ్మయ్య నుంచి తమ ఆస్తిని తమకు ఇప్పించాలని స్వరూప తన అన్న గురవయ్య, అతని భార్య తిరుపతమ్మతో కలసి ఆదివారం గ్రామపంచాయతీ పెద్దల ముందు పంచాయతీ పెట్టింది.గ్రామ పెద్దలు సమ్మయ్యను పంచాయితీకి పిలిపించారు.ఇక గ్రామస్తులు ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపించడం ప్రారంభించిన కాసేపటికి సమ్మయ్య తనతో పాటు తీసుకొచ్చిన కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో వదిన స్వరూప మీద దాడి చేశాడు.

గ్రామస్తులు ఆపే ప్రయత్నం చేసిన సమ్మయ్య, స్వరూప తలపై బలంగా కొట్టడంతో రక్తం మడుగులోకి జారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఈ సంఘటన చూసి గ్రామపంచాయతీ పెద్దలతో పాటు గ్రామస్తులంతా షాక్ అయ్యారు.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని సమ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు.స్వరూప కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.