'ముద్రగడ ' వెంటపడుతున్న వైసీపీ ? మరోసారి చర్చలు 

వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం( Kapu Social Category ) ఓట్లు కీలకం కావడంతో ఆ సామాజిక వర్గంలోని కీలక నాయకులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) ఉంది.టిడిపి , జనసేన పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోబోతుండడం తో,  కాపు సామాజిక వర్గం మద్దతు పూర్తిగా జనసేనకు( Janasena ) లేకుండా చేసేందుకు వైసిపి అనేక ప్రయత్నాలు చేస్తోంది.

 Ysrcp Kapu Leaders Meeting With Mudragada Padmanabham Details, Ysrcp, Jagan, Ap,-TeluguStop.com

దీనిలో భాగంగానే ఆ సామాజిక వర్గంలో కీలక నేతగా గుర్తింపు పొందిన కాపు ఉద్యమ నేత , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ను( Mudragada Padmanabham ) వైసీపీలో చేర్చుకునే ప్రయత్నంలో ఉంది.ముద్రగడ ప్రస్తుతం రాజకీయాలకు చాలా కాలం నుంచి దూరంగానే ఉంటున్నారు అయితే 2024 ఎన్నికల్లో రాజకీయంగా యాక్టివ్ అయ్యే ఆలోచనతో ఉన్నారు.

దీంతో ఇదే అదునుగా ముద్రగడను తమ పార్టీలో చేర్చుకుని టిడిపి జనసేనకు షాక్ ఇవ్వాలనే ఆలోచనలో వైసిపి ఉంది.ఇప్పటికే ముద్రగడను తమ పార్టీలో చేరాల్సింది గా బిజెపి , బీఆర్ఎస్ వంటి పార్టీలు ఒత్తిడి చేసినా, ముద్రగడ సైలెంట్ గానే ఉన్నారు.

అయితే ఆయన మొదటి నుంచి వైసీపీ విషయంలో సానుకూలంగా ఉండడంతో,  ఆయన ఆ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అదే ధీమాతో వైసిపి ఆయనను చేర్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది.

ఇప్పటికే అనేది సార్లు ముద్రగడ తో వైసిపి కీలక నాయకులు చర్చలు జరిపారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Jansenani, Kapu Category, Pavan Kalyan, Vanga Gee

ఈ చర్చల్లో ముద్రగడ తోపాటు, ఆయన కుమారుడికి టికెట్ అంశంపై చర్చ జరిగింది .తాజాగా కిర్లంపూడి లోని ముద్రగడ పద్మనాభం నివాసానికి వైసీపీ ఎంపీ వంగా గీత,  ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తో పాటు,  అనేకమంది కాపు నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగింది.అలాగే ఈ నెల 14వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కాబోతుండడంతో,

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Jansenani, Kapu Category, Pavan Kalyan, Vanga Gee

వీలైనంత తొందరగా ముద్రగడ కు వైసిపి కండువా కప్పే విధంగా వైసిపి ప్రయత్నాలు చేస్తోంది.ముద్రగడ ద్వారానే జనసేన దూకుడుకు బ్రేకులు వేయించాలని, ఆయన ద్వారానే పవన్ పై విమర్శలు చేయించాలని వ్యూహంతో వైసిపి ఉంది.అందుకే అంతగా ముద్రగడను వైసీపీలో చేర్చుకునేందుకు తాడపత్రయపడుతోంది.అయితే ముద్రగడ మాత్రం తన మనసులో మాట ఏమిటి అనేది ఇప్పటికీ క్లారిటీ ఇవ్వకపోవడంతో,  తాజాగా జరిగిన చర్చల్లో ఏ డిమాండ్లను ఆయన వినిపించారు ?  వైసిపి ఆ డిమాండ్లపై ఏవిధంగా రియాక్ట్ అయ్యింది అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube