ఒక వస్తువుకు తక్కవ ధర ఉన్నప్పుడే దాని అమ్మకాలు కూడా పెరుగుతాయి.ఏ వస్తువు ధర అయినా సరే సామాన్యులు కొనుగోలు చేసేలా ఉంటే సేల్స్ బాగా పెరుగుతాయి.
ఎక్కువ ధర ఉంటే సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేరు.ఏ వస్తువు ధర అయినా దాని తయారీకి అయిన ఖర్చు, రవాణాపై ఆధారపడి ఉంటుంది.
వస్తువుకు వాడిన ముడి పదార్ధాల( raw materials ) ధరలపై కూడా ఆధారపడి ఉంటుంది.దాని ప్రకారం ఎంఆర్పీని నిర్ణయిస్తారు.

అయితే ప్రపంచంలోకే ఒక్కొ దేశంలో ఒక్కొ రకంగా ధరలు ఉంటాయి.స్థానికంగా తయారుచేసే ప్రొడక్ట్స్ ధర తక్కువగా ఉంటుంది.ఇక విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు ధర ఎక్కువగా ఉంటుంది.వేరే దేశం నుంచి రావాలంటే రవాణా ఖర్చు అవుతుంది.దీంతో విదేశీ వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయి.ఇక ప్రీమియం వస్తువుల ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి.
ప్రపంచంలో తక్కువ ఖర్చుతో వస్తువులను ఉత్పత్తి చేస్తున్న దేశాలు కొన్ని ఉన్నాయి.వాటిల్లో టాప్ 10 దేశాల గురించి చూసేద్దామా.

తక్కువ ఖర్చుతో వస్తువులను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండియా తొలి స్థానంలో ( India )ఉంది.ఇండియాలో మానవ వనరులు తక్కువ ధరకు లభించడమే దీనికి కారణంగా చెబుతున్నారు.ఇక రెండో స్థానంలో చైనా ఉంది.చైనా తక్కువ ధరకే వస్తువులను తయారుచేస్తూ ప్రపంచం మొత్తానికి మార్కెట్ చేస్తోంది.కరోనాకు ముందు చైనా తొలి స్థానంలో ఉండగా.కరోనా తర్వాత రెండో స్థానానికి పడిపోయింది.
ఇక వియత్నాం మూడో స్థానంలో ఉంది.వియత్నాం జనాభా 10 కోట్లలోపే ఉంది.
కానీ వనరుల లభ్యత కారణంగా ఆ దేశంలో మూడో స్థానంలో ఉంది.ఇక థాయ్‌లాండ్.
ఫిలిప్పిన్స్, ఇండోనేషియా, బంగ్లాదేశ్.కెన్యా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.







