ఇటీవల సీఎం జగన్( CM jagan ) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించడం జరిగింది.ఆ సమయంలో ముఖ్యమంత్రి కి వినతి పత్రం ఇవ్వటానికి ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీ నాయకుడు మొగిరాల సురేష్( Mogirala Suresh ) ను పోలీసులు అడ్డగించారు.
ఆ సమయంలో కావాలి డి.ఎస్.పి వెంకటరమణ సురేష్ నూతన రెండు కాళ్ళతో బంధించి నొక్కడం ఆ ఫోటో వైరల్ అయింది.ఆ సమయంలో ఏపీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం మొగిరాల సురేష్ పట్ల కావలి డి.ఎస్.పి వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు.డిజిపి జాతీయ బీసీ కమిషన్ మానవ హక్కుల సంఘానికి బీజేపీ నాయకుల ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.ఇలా ఉంటే అదే సంఘటనపై తాజాగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( BJP President Somu Veerraju ) నేతృత్వంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
కావలిలో సురేష్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే డిఎస్పీని సస్పెండ్ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది.
అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీల ఆత్మభిమానాన్ని దెబ్బతీస్తుందని… బీసీలు అంటే సీఎం జగన్ కి ఎందుకు అంత చిన్న చూపు అని ప్రశ్నించారు.వైసీపీ ఆధ్వర్యంలో బీసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
తమ పార్టీ నేత సురేష్ పై డిఎస్పి దాడి చేయడం దారుణమని అన్నారు.ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి ముందుగానే పోలీసులు అనుమతి కోరినప్పటికీ స్పందనలేదని.
ఈ క్రమంలో వినతి పత్రం ఇవ్వటానికి ప్రయత్నించిన సమయంలో బిజెపి నాయకులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.దీన్ని నిరసిస్తూ వచ్చే నెలలో 16, 17 తారీకులలో కర్నూలులో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు.