నందమూరి తారక రామారావు( Sr ntr ) గారు సినిమా ఇండస్ట్రీ తో పాటు తెలుగు వారిని సైతం ఏకతాటిపై తీసుక వచ్చారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.కొన్నేళ్ల పాటు సినిమా పరిశ్రమ సామజిక వర్గాల ఆధారం గా నడిచింది.
ఆ టైం లో చంద్ర మోహన్ హీరోగా బాగా రాణించారు.అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల ముందు తరాలు ప్రశ్నార్ధకం అవుతాయని భావించిన ఎన్టీఆర్ అందరిని కూర్చోపెట్టి సినిమా అనేది మన కులం.
ఇందులో మళ్లి కులాల కుమ్ములాట వద్దు అని చెప్పి అందరిని మాములుగా నడిచే విధంగా చేసారు.ఈ తరుణం లో ఎన్టీఆర్ తో చంద్ర మోహన్( Chandra mohan ) కలిసి నటించాలని ఎంతో తాపత్రయ పడ్డారు.
అయన హీరోగా నటిస్తున్న సినిమాలో అయినా అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ ని అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవారట.అయితే వీరి కాంబినేషన్ లో చాల తక్కువ సినిమాలే వచ్చాయి.కానీ ఒక చిన్న అవకాశం ఎన్టీఆర్ తో నటించడానికి వచ్చిన ఆ టైం లో ఒప్పుకున్నా మిగతా సినిమాలను పక్కన పెట్టి మరి నటించేవారట. కానీ ఒక ఫుల్ లెన్త్ రోల్ లో ఎన్టీఆర్ తో కలిసి నటించాలనే కోరిక మాత్రం నేటి వరకు చంద్ర మోహన్ కి కలగలేదు.
ఒకసారి దైర్యం చేసుకొని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో వెళ్లి తాను సినిమా తీయాలనుకుంటున్న విషయం చెప్పారట.అందులో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తే ఆయనకు తమ్ముడి పాత్రలో చంద్ర మోహన్ నటించే విధంగా కథ సిద్ధం చేసుకున్నారట.
ఈ విషయం చెప్పగానే అన్నగారు ఆశ్చర్యానికి గురై.ఇన్నాళ్లు నువ్వు పొట్టి వాడివి అని మాత్రమే అనుకున్న కానీ చాల గట్టి వాడివి అన్నమాట అని అన్నారట.కథ మొత్తం విని తన తదుపరి సినిమా చంద్ర మోహన్ తోనే చేస్తా అని మాట ఇచ్చి పంపించారట.కానీ ఆ మాట ఎన్టీఆర్ కన్ను మూసే వరకు కూడా నెరవేరలేదు.
ఆ సమయంలో ఎన్టీఆర్ తదుపరి సినిమా 1993 లో శ్రీనాథ కవి సార్వభౌముడు( Srinatha kavi sarvabhowmudu ) విడుదల అయినా ఈ చిత్రంలో చంద్ర మోహన్ కి అవకాశం చిక్కలేదు.చంద్ర మోహన్ సైతం అప్పటికే హీరో రోల్స్ మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు .ఈ విషయం చంద్ర మోహన్ ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు.