యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young tiger NTR ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratal siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”NTR30”.ఈ సినిమాకు మొన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు టైటిల్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.”దేవర”( Devara movie ) అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయగా ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది.
ఇక ఈ అప్డేట్ తో కొరటాల ఈ సినిమాను ఎంత పవన్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడో అర్ధం అవుతుంది.
అలాగే కొరటాల ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
జాన్వీకి( Jonhvi ) ఇదే తొలి పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం.అందుకే ఈ సినిమా కోసం ఈమె చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది.ఈ సినిమా నుండి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.జాన్వీ ఈ సినిమాలో ఒక మత్సకారుడి పాత్రలో నటిస్తుందని.ఆమె లుక్ కూడా మొత్తం లంగా వోణీలో, శారీలో ఉంటుందట.ఇప్పటికే ఈమె లుక్ ను కూడా మేకర్స్ అలానే రివీల్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది.
మరి చూస్తుంటే ఈమె రోల్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉండడం వల్ల ఈమె ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తుంది అని తెలుస్తుంది.ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.