రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని 9 వ వార్డులో ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి తన భర్త కృష్ణ మూర్తి పేరుతో అక్రమంగా బిల్డింగ్ నిర్మాణం చేపట్టారని 9 వ వార్డు సభ్యులు బుర్ర రాములు గౌడ్ ఆరోపించారు.అక్రమ నిర్మాణాలను వెంటనే అరికట్టాలని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ఈవో ను సస్పెండ్ చేయాలని బుర్ర రాములు గౌడ్ డిమాండ్ చేస్తూ ముస్తాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5-00 గంటల వరకు కూర్చుండి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 9 వ వార్డులో 24 పీట్ల రోడ్డులో ఏవరు ఇళ్ళు నిర్మించుకున్న ఇరువైపుల మూడు ఫీట్ల చొప్పున సెట్ బ్యాక్ కావాల్సిందేనని ఆయన అన్నారు.సెట్ బ్యాక్ కాకుండా నే సర్పంచ్ సుమతి ఆమే భర్త కృష్ణమూర్తి నూతన భవంతి నిర్మాణం చేపట్టారని ఈవో ప్రోత్సాహించాడని ఆయన ఆరోపించారు.
న్యాయమైన డిమాండ్లు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన రాములు గౌడ్ కు ముస్తాబాద్ కు చెందిన పలువురు వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు మద్దత్తు తెలిపి వారు సంఘీభావం ప్రకటించారు,