అమెజాన్‌లో కళ్లు చెదిరే డీల్.. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్!

ఐఫోన్ 14 ( iPhone 14 )ప్రస్తుతం భారతదేశంలో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.దీని అసలు ధర రూ.79,900 కాగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రూ.71,999కి కొనుగోలు చేయవచ్చు.అలానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌ని( HDFC Bank Card ) ఉపయోగించడం ద్వారా ధరను రూ.4000 వరకు తగ్గించవచ్చు.పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి కూడా రూ.22,500 వరకు ధర తగ్గించుకోవచ్చు.ఇలా ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు.

 Eye-catching Deal On Amazon Huge Discount On Iphone 14, Iphone 14, Amazon, Flipk-TeluguStop.com

ఇకపోతే ఐఫోన్ 14 6.1-అంగుళాల డిస్‌ప్లే, 5G కనెక్టివిటీ, A15 బయోనిక్ చిప్( A15 bionic chip ), 512జీబీ వరకు ర్యామ్ కలిగి ఉంది.దీని డ్యూయల్-కెమెరా సిస్టమ్ డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఐఫోన్ 14 దాని అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన స్పెసిఫికేషన్‌ల కారణంగా భారతదేశంలో అధిక డిమాండ్ ఉన్న ఫోన్‌గా నిలుస్తోంది.అందుబాటులో ఉన్న ప్రస్తుత తగ్గింపులతో, వారి స్మార్ట్‌ఫోన్లను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఈ డిస్కౌంట్ గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.

ఐఫోన్ 14 HDR మద్దతుతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 1200-నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, ఫేస్ ID సెన్సార్లు, 4జీబీ ర్యామ్ + 128జీబీ/ 256జీబీ/ 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది.కనెక్టివిటీ పరంగా, ఐఫోన్ 14 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్‌కు మద్దతు ఇస్తుంది.ఛార్జింగ్ కోసం లైట్నింగ్ పోర్ట్‌ను ఆఫర్ చేస్తుంది.డ్యూయల్-కెమెరా సిస్టమ్ f/1.5 ఎపర్చరు, సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో ప్రైమరీ 12MP వైడ్-యాంగిల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube