Allu Arjun: అల్లు అర్జున్ గంగోత్రి కన్నా ముందే 50 సెకండ్స్ కనిపించే సినిమా చేసాడు తెలుసా ?

అల్లు అర్జున్…( Allu Arjun ) 2003లో గంగోత్రి సినిమాతో( Gangotri Movie ) తొలిసారిగా వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు.గత 20 ఏళ్లుగా అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతము పాన్ ఇండియా లెవల్ లో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందుతున్నాడు.

 Allu Arjun Dance In Chiranjeevi Daddy Movie-TeluguStop.com

ప్రస్తుతం పుష్ప ( Pushpa )కి సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్.అయితే అల్లు అర్జున్ చిన్నతనంలో ఒకటి రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించినప్పటికీ ఎలాంటి డైలాగులు లేక పోవడం తో పెద్దగా నోటీస్ చేసే విధంగా ఆ సినిమాలు లేవు.

ఇక అల్లు అర్జున్ హీరోగా కావాలని దాదాపు 2000 సంవత్సరం వచ్చేనప్పటి నుంచే అనుకుంటున్నాడు.అందుకు తగ్గట్టుగా డాన్సులు, ఫైట్లు, గుర్రం పై స్వారీ చేయడం వంటివి అన్ని విద్యలు నేర్చుకున్నాడు.

కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే గంగోత్రి కన్నా ముందే హీరోగా ఇండస్ట్రీకి రావాలి అనుకున్న తరుణంలో అల్లు అర్జున్ 50 సెకన్ల నిడివి ఉన్న ఒక పాత్రలో కనిపిస్తాడు.

Telugu Allu Arha, Allu Arjun, Alluarjun, Chiranjeevi, Dady, Gangotri, Icon Allu

పైగా అది మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించిన సినిమా కావడం విశేషం.2001లో అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన డాడీ సినిమాలో( Daddy Movie ) ఇలా అల్లు అర్జున్ 50 సెకండ్ల పాటు ఆగకుండా డాన్స్ చేసి అబ్బురపరిచాడు.50 సెకండ్లలో చేసిన డ్యాన్స్ చేసి అందరూ ఫిదా అవుతారంటే నమ్మండి.అప్పటికి ఇప్పటికీ అల్లు అర్జున్ ఎంతో చక్కగా డాన్స్ చేస్తాడు.అందుకే హీరో అవ్వడానికి ముందే అల్లు అర్జున్ నీ చిరు సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు.

అలా మొదలైన అతడి జర్నీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతిలో పడి గంగోత్రి వంటి విజయవంతమైన సినిమాలో నటించి నేడు స్టార్ హీరోగా ఎదిగాడు.ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం చాలా ఈజీ.కొంచం బ్యాక్ గ్రౌండ్ ఉంటే చాలు చాలా సులభంగా హీరో కావచ్చు.

Telugu Allu Arha, Allu Arjun, Alluarjun, Chiranjeevi, Dady, Gangotri, Icon Allu

కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తానేంటో నిరూపించుకుంటే తప్ప మరొక అవకాశం దొరకదు.అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే దాని ఎంతో నిరూపించుకున్నాడు అందుకే తర్వాత మంచి సినిమాల్లో నటిస్తూ హీరోగా, స్టార్ హీరోగా, ఐకాన్ స్టార్ గా ఎదిగాడు.ఇక ముందు ముందు పాన్ ఇండియా వ్యాప్తంగా అనేక సినిమాలు చేస్తూ వేల కోట్ల వసూళ్లు సాధించడం అతనికి పెద్ద విషయమేమీ కాదు.

ఇటీవల అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ శాకుంతలం సినిమా ద్వారా మొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.భవిష్యత్తులో అల్లు అర్జున్ కొడుకు కూడా హీరో అవడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube