బాక్సర్ షార్ట్స్, అండర్ వియర్ .. రెండిట్లో ఏది వాడితే బెటర్?

పురుషులు సాధారణంగా రెండు రకాల లోదుస్తులు వాడతారు.ఒకటి టైట్ గా ఉండే బ్రీఫ్ అండర్ వియర్ (ఇప్పుడు అందరు వాడే జాకి లాంటివి), మరొకటి బాక్సర్ షార్ట్స్ (వదులుగా, తొడలను కప్పేవి).

 What Type Underwear Men Should Use For Sperm Health ?-TeluguStop.com

ఒకప్పుడు ఎక్కువగా బాక్సార్ షార్ట్స్ మోడల్ లోదుస్తులే వాడేవారు మగవారు.మన ఇంట్లో తాతయ్యని అడిగిన చెప్తారు వీటి గురుంచి (ఆయన అదే వాడుతూ ఉండవచ్చు) .ఎప్పుడైతే ఈ ఫ్యాషనబుల్ బ్రీఫ్ అండర్ వియర్ వచ్చాయో, మన యువత వాటిమీదే ఎక్కువ మోజు చూపించటం మొదలుపెట్టింది.

మరి ఈ రెండిట్లో ఏది వాడితే బెటర్ ? మనిషి కావాల్సింది సౌకర్యమా లేక ఫ్యాషనా ? మీరేది వాడాలంటే అది మీ ఇష్టం కాని, పరిశోధకులు మాత్రం బాక్సర్ షార్ట్స్ నే వాడమని సూచిస్తున్నారు.ఎందుకు అని మీడు అడగవచ్చు.

ఈ టైట్ అండర్ వియర్ ఫ్యాషన్ కావచ్చు కాని, రోజంతా చెమటతో తడిసాక, వాటి వలన వచ్చే ఇబ్బంది మాటల్లో చెప్పలేనిది.

జననాంగాల దగ్గర దురదకి కారణమవుతాయి ఈ బ్రీఫ్ అండర్ వియర్స్.అంతేకాదు, బ్రీఫ్ అండర్ వియర్స్ వాడటం వలన ఆ ప్రాంతంలో టెంపరేచర్ ఎక్కువగా ఉండి, వీర్యం బలహీనపడుతుందని, వీర్య ఉత్పత్తి తగ్గుతుందని కూడా పరిశోధనలు చెప్పాయి.

మరి ఏది వాడాలో మీ ఇష్టం.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు