ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది.హీరో హీరోయిన్ లు నటి నటులకు సంబంధించిన ఫోటోలను చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఫ్యాన్స్ కూడా వారి అభిమాన సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను చూసి సంతోషపడడంతో పాటు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు.ఈ మధ్యకాలంలో అయితే తరచూ ఏదో ఒక సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
సెలబ్రిటీలు సైతం వారి చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు.
తాజాగా ఒక టాలీవుడ్ ( Tollywood )హీరోకు సంబంధించిన టీనేజ్ ఫోటో ప్రస్తుతం నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.పైన ఫోటోలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్( Venkatesh ), నిర్మాత సురేష్ బాబు( Suresh Babu ) మధ్యలో నిలబడిన ఆ కుర్రాడు ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక యంగ్ హీరో.అయితే టీనేజ్ లో ఉండడంతో చాలామంది నెటిజన్స్ అభిమానులు ఆ హీరో ఎవరు అన్నది గుర్తుపట్టలేకపోతున్నారు.
పైన ఫోటోలో మిడిల్ లో కనిపిస్తున్న ఆ యంగ్ హీరో ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.బ్యూటీఫుల్ లవ్ స్టోరీలతో ఒకప్పుడు సూపర్ హిట్స్ అందుకున్న ఈ కుర్రాడు చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.సహాయ నటుడిగానూ మెప్పిస్తున్నారు.
ఆ కుర్రాడు మరెవరో కాదు.అక్కినేని హీరో సుమంత్( Sumanth ).మొదట ప్రేమకథ సినిమాతో హీరోగా సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ తరువాత యువకుడు, స్నేహమంటే ఇదేరా, సత్యం, గౌరి, ధన 51, గోదావరి లాంటి సినిమాలలో నటించి హిట్స్ అందుకున్నారు సుమంత్.
తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు సుమంత్.ఇది ఇలా ఉంటే చాలా కాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సుమంత్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టాడు.
గత ఏడాది విడుదల అయిన సీతారామం( Sitaram ) సినిమాలో కీలకపాత్రలో నటించారు.ఇకపోతే సుమంత్ వ్యక్తిగత విషయానికి వస్తే.2004లో హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్ సుమంత ఆ తరువాత 2006లో విడాకులు తీసుకున్నారు.అప్పటి నుంచి సుమంత్ ఒంటరిగానే ఉంటున్నారు.