ఆరడుగుల ఆజానుబాహుడు.కల్లలో రౌద్రం.
మాటల్లో పౌరుషం… చూడగానే కొట్టచ్చే గాంబీర్యం.ఎంత సౌమ్యంగా, సాత్విక పాటలు చేసిన ఆ కృష్ణంరాజును చూడగానే గుర్తొచ్చేది ఆయన రౌద్ర రూపమే.
భక్తకన్నప్పలాంటి చిత్రం ఆయన కెరీర్ లోనే ఒక మచ్చుతునక అయినా కూడా ఆయన పేరు చెప్తే మన అందరికీ గుర్తొచ్చే సినిమాలు కటకటాల రుద్రయ్య, తాండ్రపాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న.కృష్ణంరాజు కెరియర్ ని హీరో నుంచి స్టార్ హీరోగా మార్చిన సినిమాలు ఇవి.కృష్ణంరాజుకి తొలినాళ్లలో సినిమా ఇండస్ట్రీ కన్నా కూడా ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట అందుకే రాయల్ స్టూడియో అనే ఒక ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు ఆ తర్వాత జర్నలిస్టుగా కూడా మారాడు కానీ అందరూ మెటీరియల్ నువ్వు, హీరోలా బాగుంటావ్ అంటూ కిక్కు ఎక్కించడంతో ఆవైపు కదిలాడు.
తనకు ఎలాంటి బేషజాలు లేవు.
ఏం చేయాలో పెద్దగా ప్లానింగ్ కూడా ఉండదు.ఎవరు ఏం చెప్తే అదే చేశాడు ఏ పాత ఇస్తే అదే నటించాడు హీరోగా చేశాడు, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారాడు.
అందరు హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటుంటే కృష్ణంరాజు మాత్రం తన ఫ్యాన్స్ తో బాగా ఉండేవాడు.పెద్ద హీరోల సినిమాల్లో చిన్న పాటలు కూడా చేసిన కృష్ణంరాజు ఆ తర్వాత కాలంలో మల్టీస్టారర్ సినిమాలకు కేంద్ర బిందువుగా మారాడు.
ఏకంగా కృషితో 17 సినిమాల్లో నటించాడంటే కృష్ణం రాజు ఎంత సాఫ్ట్ నేచర్ మనం అర్థం చేసుకోవచ్చు. శోభన్ బాబు తో సైతం అనేక సినిమాల్లో నటించాడు.
ఇక కృష్ణంరాజు అనేసరికి సాత్వికత విషయాలకు దూరంగా ఉండేవారు దర్శకులు, మంచి డైలాగులు చెప్పడానికి ఇష్టపడేవారు, డ్యాన్సులు వేయడం పెద్దగా నచ్చేది కాదు కృష్ణంరాజుకి.

ఇక రాజకీయాల విషయానికి వచ్చేసరికి కృష్ణంరాజు ఒక నాన్ సీరియస్ అప్రోచ్ అనే చెప్పాలి.తను ఇది కావాలని అడగడు అలా అని ఎవరు ఏమిచ్చినా తీసుకుంటాడు.తొలి నాళ్ళల్లో కాంగ్రెస్ లో ఉన్నాడు, ఆ తర్వాత ఆ బిజెపిలో చేరాడు .ఎంపీగా, కేంద్రం మంత్రిగా కూడా పనిచేశాడు.అక్కడ నుంచి ఈ సీన్ కట్ చేస్తే ప్రజారాజ్యంలో కూడా చేరాడు.
ఆ తర్వాత ఇంకేదో పార్టీలో కూడా కనిపించాడు ఇలా రాజకీయంలో ఒకచోట స్థిరంగా ఉండలేదు.పెద్దగా ఎవరితో వివాదాలు పెట్టుకోడు.కాలం ఎటు తీసుకెళ్తే కృష్ణంరాజు ప్రయాణం అలాగే సాగింది.ఎవరితోనూ వివాదాలు పెట్టుకున్న చెడ్డ పేరు కూడా కృష్ణంరాజుకి లేదు.
అందుకే ఆయన రాజు.కృష్ణం రాజు