సుడిగాలి సుధీర్ ని ఘోరంగా అవమానించిన హైపర్ ఆది.. ఆమెతో లింక్ చేస్తూ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ల జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ జంటకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Hyper Aadi Satires On Sudheer Rashmi Gautam In Jabardasth Latest Promo Hyder Aad-TeluguStop.com

రీ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఈ జంట ఒక్కటైతే చూడాలి అని లక్షలాదిమంది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ జంట వారి మధ్య లవ్ లాంటిది ఏమీ లేదని కేవలం స్క్రిప్ట్ ప్రకారం స్క్రీన్ మీద అలా నటిస్తాము అనే పలుసార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇకపోతే సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసింది.

ఇక జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికే పలువురు కమెడియన్లు జబర్దస్త్ స్టేజ్ పై సుడిగాలి సుదీర్ పేరును తెస్తూ మధ్యలో రష్మిని ఇన్వాల్వ్ చేస్తూ ఆమెపై సెటైర్లు వేస్తూ వస్తున్నారు.

ఆది, రాం ప్రసాద్ ఇలా అందరూ కూడా సుధీర్ రష్మీ మీద కౌంటర్లు వేస్తుంటారు.ఇక తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో ఆది గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడం కాకుండా ఎంట్రీ ఇవ్వడంతోనే రష్మీ మీద పంచులు వేసేశాడు.

గత రెండు మూడు నెలలుగా హైపర్ ఆది జబర్దస్త్ స్టేజీలో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే డ్యాన్సులతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది.ఆది వచ్చీ రాగానే రష్మీ మీద కౌంటర్లు వేశాడు.

ఇక స్కిట్ లో భాగంగా రష్మీ దగ్గరికి వెళ్లిన హైపర్ ఆది నీలాంటి అమ్మాయి దక్కాలంటే ఏం చేయాలి అని అడగగా వెంటనే రష్మీ నా వెనకాల చాన్నాళ్లు తిరగాలి అని అంటుంది.ఏంటి నీలాంటి అమ్మాయిలు తిరగాలా ఈ విషయం తెలియక గాల్లోడు ఛానళ్లు అన్ని తిరిగేస్తున్నాడు అంటూ సుధీర్ పై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేశాడు.ఇక హైపర్ ఆది పంచులకు రష్మీ ముఖం ఒకవైపు పెట్టుకుని పక్కపక్క నవ్వేసింది.

ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube