ఇండియాలోనే తొలి వాటర్ మెట్రో లాంచ్.. ఆ విశేషాలు ఇవే..

సాధారణంగా మెట్రో అనగానే మనకు ట్రైన్ గుర్తుకొస్తుంది.అయితే ఇకపై మెట్రో అంటే బోట్లు కూడా గుర్తుకు రానున్నాయి.

 The First Water Metro Launch In India.. These Are The Features , Water Metro, K-TeluguStop.com

ఎందుకంటే రేపటి నుంచి భారతదేశంలో వాటర్ మెట్రో అందుబాటులోకి రానుంది.భారతదేశపు మొట్టమొదటి “వాటర్ మెట్రో( Water Metro )” సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) ఏప్రిల్ 25 న కేరళలోని కొచ్చిలో ప్రారంభించనున్నారు.

వాటర్ మెట్రో అనేది కొచ్చిలో ఆర్థిక వృద్ధి, పర్యాటకం, రవాణా కనెక్టివిటీని పెంపొందించడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేకమైన పట్టణ రవాణా వ్యవస్థ.

ఈ ప్రాజెక్టుకు రూ.1,136.83 కోట్ల వ్యయం అవుతుంది.ఈ ప్రాజెక్టుకు కేరళ ప్రభుత్వం( kerala govt ), జర్మన్ బ్యాంక్ KfW ద్వారా నిధులు సమకూరుస్తున్నారు.వాటర్ మెట్రో కొచ్చి నగరం, చుట్టుపక్కల ఉన్న 10 దీవులను కలుపుతుంది.

ఇందులో 78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మినల్స్ ఉంటాయి.కొచ్చి వాటర్ మెట్రో ప్రాజెక్ట్ మొదటి దశగా హైకోర్టు-వైపిన్ టెర్మినల్స్ నుంచి వైట్టిల-కక్కనాడ్ టెర్మినల్స్ వరకు పనిచేయడం ప్రారంభిస్తుంది.

వాటర్ మెట్రోలో తేలియాడే పాంటూన్లు ఉన్నాయి.ప్రయాణికులు కొచ్చి మెట్రో, వాటర్ మెట్రో రెండింటిలో “కొచ్చి 1” కార్డ్‌ని ఉపయోగించి ప్రయాణించవచ్చు.వారు డిజిటల్‌గా టిక్కెట్‌లను కూడా బుక్ చేసుకోవచ్చు.పడవ ప్రయాణాలకు కనీస టిక్కెట్ ధర రూ.20, సాధారణ ప్రయాణికులకు వారానికి, నెలవారీ పాస్‌లు ఉన్నాయి.తక్కువ ఖర్చుతో కూడిన, సురక్షితమైన ఎయిర్‌ కండిషన్‌ పడవల్లో ప్రయాణం చేయడం వల్ల ప్రజలు ట్రాఫిక్‌ చిక్కుల్లో చిక్కుకోకుండా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు.

ఏది ఏమైనా భారతదేశంలో సరికొత్త రవాణా వ్యవస్థలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజల ప్రయాణాలు మరింత సులభతరం అవుతున్నాయి.మోడీ సర్కార్లో ముందు ముందు ఎలాంటి అద్భుతమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube