రంజాన్ నెలలో వీటిని తీసుకుంటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరికి రంజాన్ మాసం( Ramadan ) చాలా పవిత్రం, ప్రత్యేకమైనది.ఈ సమయంలో చాలామంది ముస్లింలు చాలా కఠినంగా ఉపవాసాలు ఉంటారు.

 Do You Know How Many Health Benefits There Are If You Take These In The Month Of-TeluguStop.com

అలాగే సూర్యోదయ సమయంలో సేహరీ చేస్తారు.ఇక సూర్యస్తమయం సమయంలో ఇఫ్తార్( Iftar ) చేస్తారు.

అయితే రంజాన్ సమయంలో ఉపవాసం ఉండడం చాలా మంచి విషయం.ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడానికి పనిచేస్తుంది.

అలాగే గరిష్టంగా బరువు కూడా కోల్పోతారు.

అలాగే కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్, ప్రెషర్( Cholesterol, sugar levels, pressure ) అన్నిటిని కంట్రోల్ కూడా చేస్తుంది.

ఉపవాసం ఉండడం వలన వాపును కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది.అయితే చాలామంది రంజాన్ ఉపవాస సమయంలో కొన్ని విజయాలలో కచ్చితంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.అయితే సెహరీ లేదా ఇఫ్తార్ సమయంలో కొన్ని ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.శరీరం హైడ్రేట్ గా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

ఇక చాలా మంది ఇఫ్తార్ సమయంలో ఖర్జూరాన్ని రంజాన్ లో తీసుకుంటూ ఉంటారు.అయితే ఖర్జూరంలో( dates ) ఫైబర్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.అందుకే వాటిని తీసుకోవడం చాలా మంచిది.అయితే ఖర్జూరం పెరుగు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పెరుగు ఒక పాల ఉత్పత్తి అందుకే పాలతో పోలిస్తే పెరుగులో ప్రోబయోటిక్ బాక్టీరియా( Probiotic bacteria ) ఎక్కువగా ఉంది.

ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.అలాగే పెరుగు ( Curd )పేగులకు ఎంతో మేలు చేస్తుంది.ఎందుకంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, క్యాల్షియం, విటమిన్ ఏ ఆరోగ్యాన్ని ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉండడం వలన కీళ్లకు కూడా మంచిది.ఈ విధంగా ఉపవాసం ఉండడం శరీరానికి చాలా మంచిది.అదేవిధంగా ఉపవాసంలో ఉన్న సమయంలో ఖర్జూరాన్ని అలాగే పెరుగును తినడం కూడా చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube