Maheshwari : బర్త్ డే రోజు కూడా బండ బూతులు తిట్టారు.. సీరియల్ నటి ఆవేదన?

సాధారణంగా ప్రేక్షకులు సినిమాలలో అలాగే సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ లో నటించే వాళ్ళు బయట కూడా అలాగే ఉంటారని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు.ఇక సీరియల్స్ లో సినిమాలలో నెగిటివ్ క్యారెక్టర్ లను చూసి బండ బూతులు తిట్టుకుంటూ ఉంటారు.

 Prema Entha Madhuram Serial Actress Maheswari As Mansi-TeluguStop.com

సినిమాల సంగతి పక్కన పెడితే మరీ ముఖ్యంగా సీరియల్స్ లో అయితే లేడీ విల్లన్స్ ( Lady Villains )ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు.అయితే అలా సీరియల్స్ లో నెగటివ్ రోల్స్ లో నటించేవారు ఎప్పుడైనా బయట కనిపించారు అంటే వారిపై కోపగించుకోవడం తిట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

అలాంటివారికి బయట మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి.

Telugu Arya, Maheswari, Mansi, Premaentha-Movie

అలాంటి అనుభవమే తెలుగు బుల్లితెర నటికీ ఎదురైంది.ఆ నటి మరెవరో కాదు ప్రేమ ఎంత మధురం సీరియల్ మాన్సీ( Mansi ).జీ తెలుగులో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో మాన్సీ నెగిటివ్ రోల్ లో చేస్తున్న విషయం తెలిసిందే.ఆమెను చూస్తే చాలు చాలా మంది ప్రేక్షకులు కోప్పడే వారు చిరాకు పడేవారు చాలామంది ఉన్నారు.ప్రేమ ఎంత మధురం సీరియల్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది అను, ఆర్య( Anu, Arya ).ఈ రెండు క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఫేమస్ అయ్యాయో మాన్సీ క్యారెక్టర్ కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది.మాన్సీ అసలు పేరు మహేశ్వరి( Maheshwari ).ఈమె పక్కా తెలుగు అమ్మాయి.

Telugu Arya, Maheswari, Mansi, Premaentha-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదట.ఇంటర్ చదువుతున్న సమయంలో నా కోడలు బంగారం సీరియల్ ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యాను అందులో నెగటివ్ రోల్ వచ్చింది.

తర్వాత రాధమ్మ కూతురు సీరియల్ లో కూడా నెగిటివ్ రోల్ లో నటించాను.ప్రేమ ఎంత మధురం సీరియల్ లో కూడా నెగిటివ్ రోల్ లో నటించాను.

నాకు మొదటినుంచి అన్ని నెగటివ్ రోల్స్ వస్తున్నాయి తప్పని సరి పరిస్థితుల్లో నటించాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చింది మహేశ్వరి.నేను సీరియల్స్ లో ఎక్కువగా నెగిటీవ్ పాత్రల్లో నటించాను కనుక నన్ను కొంతమంది సైకో అమ్మాయిగా ట్రీట్ చేస్తుంటారు.

బయట ఎక్కడికైనా వెళ్తే శ్రుతి, మాన్సీ అంటూ కోపంగా పిలుస్తుంటారు.నిన్ను చూస్తే మాకు చాలా కోపం వస్తుందని అంటుంటారు.నా పుట్టిన రోజున కూడా బండబూతులు తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు.ఏది ఏమైనా నా క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందన్న సంతోషం నాకు ఉంది.

తెరపై అలా కనిపిస్తాం కానీ తెర వెనుక మేము అందరు మంచి స్నేహితులమే అని చెప్పుకొచ్చింది మహేశ్వరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube