వలస వచ్చిన చీతాలకు కొత్త పేర్లు పెట్టేసారోచ్.. పూర్తి వివరాలు ఇవే!

దేశంలో రోజురోజుకీ చీతాలు( Cheetahs ) అంతరించిపోతున్న సంగతి అందరికీ తెలిసినదే.అందుకే వివిధ ప్రాంతాలనుండి మనం చింతలను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి.

 Immigrant Cheetahs Are Given New Names.. Here Are The Full Details , Immigrant C-TeluguStop.com

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌( Kuno National Park )లో విడుదల చేసిన నమీబియా, దక్షిణాఫ్రికా చీతాలకు పేర్లు మార్చడం జరిగింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) గతేడాది సెప్టెంబర్ 25న తన మన్ కీ బాత్‌లో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలకు సంబంధించి కొత్త పేర్లను సూచించమని పౌరులను కోరగా ఆ తంతు తాజాగా పూర్తయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రాజెక్ట్ చీతా గురించి సాధారణ ప్రజలకు ప్రాచుర్యం కల్పించడం, చైతన్యం కలిగించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.కాగా దీనికి ప్రతిస్పందనగా చీతాలకు కొత్త పేర్లను సూచిస్తూ మొత్తం 11,565 ఎంట్రీలు వచ్చాయి.

ఈ ఎంట్రీలను ఎంపిక కమిటీ పరిశీలించింది.నమీబియా, దక్షిణాఫ్రికా చీతా కొత్త పేర్లను సూచించిన పోటీ విజేతలను పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అభినందించింది.

ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన వీడియోను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ట్విట్టర్‌లో షేర్ చేయడం జరిగింది.

నమీబియా చీతాల పాత పేర్లు – కొత్త పేర్లు

:
టిబ్లిసి-శౌర్య ఫ్రెడ్డీ- శౌర్య ఎల్టన్ -గౌరవ్ సియాయా- జ్వాల సవన్నా- నభా ఒబాన్- పవన్ అశ- ఆశా.

దక్షిణాఫ్రికా చీతాల పాత పేర్లు-కొత్త పేర్లు:


ఫిండా అడల్ట్ ఫీమేల్-దక్ష మాపేసు సబ్ అడల్ట్ ఫీమేల్- నిర్వా ఫిండా అడల్ట్ మేల్1- వాయు ఫిండా అడల్ట్ మేల్2- అగ్ని త్స్వాలు అడల్ట్ ఫీమేల్- గామిని త్స్వాలు అడల్ట్ మేల్-తేజస్ త్స్వాలు సబ్ అడల్ట్ ఫిమేల్-వీర త్స్వాలు సబ్ అడల్ట్ మేల్-సూరజ్ వాటర్‌బర్గ్ బయోస్పియర్ అడల్ట్ ఫీమేల్-ధీర వాటర్‌బర్గ్ బయోస్పియర్ మేల్- ఉదయ్ వాటర్‌బర్గ్ బయోస్పియర్ అడల్ట్ మేల్ 2-ప్రభాస్ వాటర్‌బర్గ్ బయోస్పియర్ అడల్ట్ మేల్3-పావక్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube