ప్రభాస్ డైరెక్టర్ తో సుడిగాలి సుదీర్... గాలోడు లక్ మామూలుగా లేదు?

ఎక్కడో మెజీషియన్ గా పని చేసుకుంటూ కాలం గడుపుతున్న సుడిగాలి సుదీర్ ( SudigalI Sudheer ) కెరియర్ ను జబర్దస్త్ కార్యక్రమం మార్చేసిందని చెప్పాలి.జబర్దస్త్ ( Jabardasth )కార్యక్రమంలో కమెడియన్ గా చేరిన సుధీర్ తన నటనలతో అందరినీ తన కామెడీతో మెప్పించి అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు.

 Sudhirgali Sudhir With Prabhas Director Galodu Luck Is Not Normal Dadaradh, Sud-TeluguStop.com

ఇలా సుధీర్ బుల్లితెరపై అంచలంచలుగా ఎదుగుతూ బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా బుల్లి తెర పై ఎంతో మంచి క్రేజ్ రావడంతో ఈయనకు వెండితెరపై కూడా వరుస అవకాశాలు వచ్చాయి.అయితే మొదట్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు కానీ గత ఏడాది గాలోడు( Gaalodu ) సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.

ఇలా గాలోడు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన కాలింగ్ సహస్ర అని సినిమా చేస్తున్నప్పటికీ ఈ సినిమా గురించి పెద్దగా ఏ విషయమైనటువంటి అప్డేట్స్ బయటకు రాలేదు.తాజాగా సుడిగాలి సుదీర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుధీర్ ఏకంగా ప్రభాస్( Prabhas ) డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ జంటగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ దశరథ్ ( Dadaradh ) దర్శకత్వంలో సుధీర్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి దశరథ్ అనంతరం పలు సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు.ఇలా ఇండస్ట్రీలో ఫెయిడౌట్ అయినటువంటి ఈయన తిరిగి ఇండస్ట్రీలో ఎలాగైనా సక్సెస్ సాధించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట.ఈ క్రమంలోనే సుధీర్ తో ఓ సినిమా చేయాలని దశరథ్ భారీగా ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఇదే కనుక నిజమైతే సుధీర్ బంపర్ ఆఫర్ కొట్టేసారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube