'కంగువ' షూట్ అప్డేట్.. కేరళలో కొత్త షెడ్యూల్!

కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య ( Suriya ) .అక్కడ స్టార్ హీరోగా రాణిస్తున్న విజయ్ కు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అనే చెప్పాలి.

 Suriya Kanguva Next Schedule Commences Today In Kerala, Kerala, Kanguva, Suriya-TeluguStop.com

అందుకే ఈయన సినిమాల కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు.ఈ మధ్య కాలంలో సూర్య నటిస్తున్న అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి.

మరి ప్రస్తుతం సూర్య నటిస్తున్న సినిమాల్లో ”కంగువ” ( Kanguva ) ఒకటి.ఈ సినిమా కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.డైరెక్టర్ శివ ( director Siruthai Siva ) దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.

గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ రివీల్ చేసారు.

దీంతో పాటు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా ఆకట్టుకుంది.సూర్య కెరీర్ లో 42వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇప్పుడు ఈ సినిమా షూట్ ( Kanguva Shoot Update ) నుండి తాజాగా ఒక సమాచారం అందుతుంది.

కంగువ షూటింగ్ కొత్త షెడ్యూల్ ను ఈ రోజు కేరళలో ( Kerala ) స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ కొత్త షెడ్యూల్ లో హీరో హీరోయిన్లతో పాటు ప్రధాన పాత్రలందరు పాల్గొన బోతున్నారట.

వీరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు టాక్.యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.మరి సూర్య ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube