‘కంగువ’ షూట్ అప్డేట్.. కేరళలో కొత్త షెడ్యూల్!
TeluguStop.com
కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య ( Suriya ) .
అక్కడ స్టార్ హీరోగా రాణిస్తున్న విజయ్ కు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అనే చెప్పాలి.
అందుకే ఈయన సినిమాల కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు.
ఈ మధ్య కాలంలో సూర్య నటిస్తున్న అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి.
"""/" /
మరి ప్రస్తుతం సూర్య నటిస్తున్న సినిమాల్లో ''కంగువ'' ( Kanguva ) ఒకటి.
ఈ సినిమా కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
డైరెక్టర్ శివ ( Director Siruthai Siva ) దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.
ఇప్పటికే కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ రివీల్ చేసారు.
"""/" /
దీంతో పాటు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా ఆకట్టుకుంది.సూర్య కెరీర్ లో 42వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇప్పుడు ఈ సినిమా షూట్ ( Kanguva Shoot Update ) నుండి తాజాగా ఒక సమాచారం అందుతుంది.
కంగువ షూటింగ్ కొత్త షెడ్యూల్ ను ఈ రోజు కేరళలో ( Kerala ) స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ కొత్త షెడ్యూల్ లో హీరో హీరోయిన్లతో పాటు ప్రధాన పాత్రలందరు పాల్గొన బోతున్నారట.
"""/" /
వీరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు టాక్.యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మరి సూర్య ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.
రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటే ఇది తప్పక తెలుసుకోండి!