నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి డీఎంఈ బృందం చేరుకుంది.రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటనపై విచారణకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ముగ్గురు సభ్యుల బృందం విచారణ జరుపుతుంది.హరీశ్ రావు ఆదేశాలతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
అయితే గత నెలలో రోగిని తల్లిదండ్రులు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఆస్పత్రి సిబ్బంది వీల్ చైర్ తీసుకొచ్చే సమయంలోనే లిఫ్ట్ రావడంతో లాక్కెళ్లారని చెబుతున్నారు.