ఒకే ఇంట్లో ఒక తల్లికి పుట్టిన బిడ్డలంతా ఒకే తరహాలో తెలివితేటలు కలిగి ఉండరు.ఒకేలా కెరీర్‌లో రాణించలేరు.
ఇలా అన్నదమ్ములు ఒకే రకమైన రంగంలో రాణిస్తుంటే అది చాలా బాగుంటుంది.ముఖ్యంగా మన దేశంలో క్రికెట్‌ను ఎంతగానో అభిమానిస్తారు.
ముఖ్యంగా ఐపీఎల్ వచ్చిందంటే టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతుంటారు.అంతలా అభిమానించే ఈ ఐపీఎల్‌లో కొందరు అన్నదమ్ములు పాల్గొన్నారు.
ఐపీఎల్( IPL ) ఆడి మనలను ఎంతగానో అలరించారు.ఈ జాబితాలో ఉన్న క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో( Indian Premier League ) చోటు సంపాదించడం చాలా మంది క్రికెటర్లకు కల.అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అలాంటి ఘనతను సాధించగలిగితే అది చాలా అరుదైనది.ఐపీఎల్ లీగ్ అంతటా వివిధ జట్లలో పలువురు సోదరులు కనిపించారు.వారిలో కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య ( Krunal Pandya, Hardik Pandya )తొలి స్థానంలో ఉన్నారు.
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్య కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.కృనాల్ పాండ్య లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడుతున్నాడు.వీరిద్దరూ గతంలో ఒకేసారి ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మైఖేల్ హస్సీ, డేవిడ్ హస్సీ( Michael Hussey, David Hussey ) ఐపీఎల్‌లో ఆడారు.
మైఖేల్ హస్సీ చెన్నై సూపర్ కింగ్స్‌కి చాలా సంవత్సరాలు ఆడాడు.ముంబై ఇండియన్స్‌కి ఒక సంవత్సరం ప్రాతినిధ్యం వహించాడు.
డేవిడ్ హస్సీ సీఎస్‌కే, పంజాబ్, కోల్‌కతా జట్లకు ఆడాడు.భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ సైతం టీమిండియాతో పాటు ఐపీఎల్ సైతం ఆడారు.
షాన్ మార్ష్, మిచెల్ మార్ష్( Shaun Marsh, Michelle Marsh ) సోదరులు కూడా ఐపీఎల్ ఆడారు.ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో ఆల్బీ మోర్కెల్, మోర్నే మోర్కెల్ కూడా ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహించారు.
డువాన్ జాన్సన్, మార్కో జాన్సెన్ సోదరులు సైతం ఐపీఎల్ ఆడారు.వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో, డారెన్ బ్రావో సోదరులు, భారత్‌కు చెందిన సిద్ధార్థ్ కౌల్, ఉదయ్ కౌల్ సోదరులు సైతం ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.