సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నప్పటికీ బాలయ్య చిరంజీవి( Balayya Chiranjeevi ) సినిమాల మద్యే ఎక్కువ పోటీ ఉంటుంది.అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాలయ్య చిరంజీవి సినిమాల మధ్య పోటీ వచ్చిందంటే ఎవరి సినిమా హిట్ అవ్వుతుంది అనే ప్రశ్న ఫాన్స్ తో పాటు జనాల మధ్య కూడా చాలా క్యూరియాసిటీ ని నింపుతుందనే చెప్పాలి అయితే వీళ్లిద్దరి సినిమాలు ఎన్ని సార్లు పోటీ పడ్డాయి వాటిలో ఎవరు ఎన్ని సార్లు గెలిచారు అనేది ఒకసారి తెలుసుకుందాము.
మొదటిసారి వీళ్ళ మధ్య పోటీ 1985 లో బాలయ్య ఆత్మబలం సినిమాతో వస్తే , చిరంజీవి చట్టంతో పోరాటం సినిమా తో వచ్చి మంచి విజయం సాధించారు.బాలయ్య చేసిన ఆత్మ బంధువు మాత్రం ప్లాప్ అయింది.
అలాగే 1987 లో బాలయ్య భార్గవ రాముడు సినిమా తో వస్తే , చిరంజీవి దొంగ మొగుడు సినిమా తో వచ్చాడు.దింట్లో దొంగ మొగుడు( Donga mogudu ) బ్లాక్ బస్టర్ హిట్ అయింది,బాలయ్య భార్గవ రాముడు సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది.
ఆ తర్వాత వీళ్లిద్దరు మళ్ళి 1988 లో పోటీ పడ్డారు చిరంజీవి మంచి దొంగ సినిమాతో వస్తే బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా తో మన ముందుకు వచ్చాడు దింట్లో మంచి దొంగ సినిమా సూపర్ హిట్ అయింది బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ మాత్రం ఎబోవ్ అవరాజ్ అయింది ఇలా రెండు సిన్మాలు హిట్టు అయ్యాయి.
1999 లో చిరు స్నేహం కోసం సినిమాతో వస్తే బాలయ్య మాత్రం సమర సింహ రెడ్డి సినిమా తో వచ్చాడు ఇందులో చిరంజీవి స్నేహం కోసం( Sneham kosam ) యావరేజ్ అయితే బాలకృష్ణ సమరసింహా రెడ్డి( Samarasimha Reddy ) మాత్రం ఇండస్ట్రీ హిట్ అయింది…ఇక 2000 సంవత్సరం లో చిరంజీవి అన్నయ్య సినిమా తో వస్తే బాలయ్య వంశోద్ధారకుడు( vamsoddharakudu ) సినిమా తో వచ్చాడు.దింట్లో అన్నయ్య( Annaya ) సినిమా సూపర్ హిట్ అయితే బాలయ్య వంశోద్ధారకుడు మాత్రం ప్లాప్ అయింది ఈ సినిమా లో స్టోరీ అంత బాగోలేకపోవడమే ఈ సినిమా ప్లాప్ కి కారణం…అలాగే 2001 వ సంవత్సరం లో చిరంజీవి మృగ రాజు సినిమా తో వస్తే బాలయ్య మాత్రం నరసింహ నాయుడు సినిమా తో వచ్చాడు.బాలయ్య సమరసింహ రెడ్డి సినిమాతో ఎలాగైతే హిట్ కొట్టాడో అలాగే ఈ సినిమా తో కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
2004 లో చిరంజీవి అంజి మూవీ తో వస్తే బాలకృష్ణ లక్ష్మి నరసింహ సినిమా తో వచ్చారు ఈ సినిమాల్లో అంజి ప్లాప్ అయింది లక్ష్మి నరసింహ మాత్రం మంచి హిట్ సినిమా గా నిలిచింది ఈ సారి కూడా బాలయ్య దే గెలుపు అయింది అయితే 2017 లో పోటీ మళ్ళీ పడ్డారు చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో వస్తే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో వచ్చారు.ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి కానీ చిరంజీవి సినిమా అయిన ఖైదీ నెంబర్ 150 సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది…మొన్న జరిగిన సంక్రాంతి కి కూడా చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలయ్య ది వీర సింహ రెడ్డి రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి…
.