బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గేటు దాటనివ్వనని ఒకరు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో కేసీఆర్ ముందు అలాంటి శపథాలు భూస్థాపితం అయ్యాయని తెలిపారు.ఏదో కడుపునొప్పి కలిగి బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలే తమను మళ్లీ అసెంబ్లీకి పంపుతారని ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా ఇటీవల జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడు ఘటన బాధితులకు త్వరలోనే రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని వెల్లడించారు.