రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి జగన్( Jagan ) కార్యక్రమం మొక్కుబడి వ్యవహారo లా మారిపోయిందనివార్తలు వస్తున్నాయి ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నారని మౌలిక సదుపాయాల పైన, రోడ్ల పైన, ప్రజల నుంచి నిలదీతలు ఎదురు కావడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యేలు ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు.

మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా తమతమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఆసక్తిగా పాల్గొన్నారు….మీడియా కవరేజ్ కూడా భారీ స్థాయిలో ఉండటం జగన్ చాలా ఇష్టపడి ప్రవేశపెట్టిన కార్యక్రమం కావడంతో ఎమ్మెల్యేలు అందరూ పాల్గొని పోటో లకు పోజులు ఇచ్చారు అయితే రోజులు గడిచేకొద్ది ఇంటింటికి తిరగడంలో ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు వినపడుతున్న సమస్యలను తీర్చడం ఎమ్మెల్యేలకు తలకిమించిన భారం అవుతుందని సమాచారం.ప్రజల సమస్యలు తీర్చే ఆర్థిక వనరులు కేటాయించే పరిస్థితి ప్రభుత్వానికి లేకపోవడం, ప్రజలకు సర్ది చెప్పడం కూడా కష్టం గా మారడం తో ఎందుకొచ్చిన తంటా అంటూ ఏకంగా కార్యక్రమనికే డుమ్మా కొడుతున్నారట .మెజారిటీ నియోజకవర్గాలలో పరిస్థితి ఇలానే ఉందని సమాచారం ఎక్కడికక్కడ భారాన్ని వాలంటీర్లకు ,గృహసారథులకు ( volunteers , housewives )అప్పచెప్పి ఎమ్మెల్యేలు ఎస్కేప్ అవుతున్నారని సమాచారం.వాలంటీర్లు గృహ సారధులు ఇంటింటికి వెళ్లి అంతా అనుకూలంగా ఉన్నట్లుగా రిపోర్టు రాసుకొని తూతూ మంత్రం గా కార్యక్రమాన్ని నడిపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రజా వ్యతిరేకతను తగ్గించుకొని వచ్చే ఎన్నికల్లో గెలవడానికి రోడ్డు మ్యాప్ వేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇలా నీరుగారిపోవడం వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది అనే చెప్పాలి కార్యక్రమం విజయవంతం అవ్వడం కోసం ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి బాగానే క్లాస్ పీకారు .ఈ కార్యక్రమంలో ఇమేజ్ పెంచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టం అని కూడా తేల్చి చెప్పారు అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనార్హం.మరి ఎమ్మెల్యేలకు గైర్హాజరీ అవుతున్న విషయాన్ని అధిష్టానం ఏ మేరకు పట్టించుకోని దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో చూడాలి.