ఖుషి లాంటి ఒక సినిమా తీసిన దర్శకుడు జూనియర్ ఆర్టిస్ట్( Junior Artist ) అవ్వడం ఏంటి అనే అనుమానం రావచ్చు.పవన్ కళ్యాణ్ కి ( Pawan Kalyan ) ఎన్ని ప్లాప్ సినిమాలు వచ్చిన ఖుషి సినిమా క్రేజ్ వల్ల దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీ లో నిలదొక్కుకోగలిగాడు.
మరి ఇంతటి వ్యక్తి గురించి ప్రపంచానికి తెలియని అనేక విషయాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి.ఎస్ జె సూర్య( SJ Surya ) పూర్తి పేరు జస్టిన్ సెల్వరాజ్ సమనసు పాండ్యన్ . స్పైడర్ సినిమాలో సూర్య నటన చూసాక ఒక మెథడ్ యాక్టర్ అని చెప్పక తప్పదు.అందరి కంటే కూడా వ్యత్యాసమైన మరియు భిన్నమైన దర్శకుడు కూడా అతడి పేరు చెప్పగానే గుర్తస్తాడు.
చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక బలం గా ఉంది.కానీ తల్లిదండ్రులు డిగ్రీ పూర్తి చేయకుండా ఎలాంటి సినిమాల జోలికి పోకూడదని షరతు పెట్టడం తో అందుకు ఒకే చెప్పి వారి కోసం డిగ్రీ పూర్తి చేసి పట్టా తండ్రి చేతిలో పెట్టాడు.
కేవలం డిగ్రీ పట్టా కోసం చదివాడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే.విషయాలను పూర్తిగా అర్ధం చేసుకొని లయోలా కాలేజీ లో బియస్సీ మేథమెటిక్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్సెస్ చేరి సబ్జెక్టు పైన గ్రిప్ సాధించి మంచి రాంక్ తో పాస్ అయ్యాడు.
అప్పుడు మళ్లి పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

మొదట జూనియర్ ఆర్టిస్ట్ గా కిళక్కు చిమిలై, నెత్తి అడి సినిమాల్లో నటించాడు.చాల మట్టుకు ఒక్క డైలాగ్ ఉన్న పాత్రా అయినా చేయడానికి తహతహ లాడే వాడు.ఒక వేళా డైలాగ్ లేకపోతే ఏదైనా ప్రాపర్టీ పట్టుకొని కెమెరా ముందు నుంచి వెళ్లే సీన్ అయినా చేసేవాడు.
అలాగైనా తనను జనాలు చూస్తారు అని అనుకునే వాడు.అప్పటి టాప్ డైరెక్టర్స్ అయినా మహేంద్ర, బాలు, బాల చందర్, భాగ్యరాజ్ వంటి వారి సినిమాల్లో క్రమం తప్పకుండ జూనియర్ ఆర్టిస్ట్ వెళ్లి చేరిపోయేవాడు.

కానీ ఎన్ని సినిమాల్లో చేసిన అతడిని చుసిన వారే లేరు.ఒకరోజు ఒక 60 ఏళ్ళ ముసలాయన, హీరో అవ్వాలంటే ఎన్ని ఏళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా నటించిన నాలాగా ముసలాడివి అవుతావు తప్ప హీరో కాలేవు ఇకనైనా మేలుకో అని చెప్పగానే జ్ఞానోదయం అయ్యింది.అప్పుడు సినిమా వదిలి మళ్ళీ కాలేజ్ లో చేరాడు.ఆ తర్వాత ఎలా దర్శకుడు అయ్యాడు అనేది మరో ఆర్టికల్ లో తెలుసుకుందాం.