మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటనలో ఏ స్థాయిలో మెప్పిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన కామెడీ మాత్రమే కాదు తన టాలెంట్ తో ఎమోషన్స్ కూడా పండించ గలడు.
అందుకే ఈయనకు వరుస ప్లాప్స్ వచ్చిన ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గదు.మరి ఈ మధ్య రవితేజకు టైం బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి.
ఎందుకంటే ఈయన గత రెండు సినిమాల నుండి మంచి హిట్స్ అందుకున్నాడు.
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న రవితేజ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
రవితేజ హీరోగా సుధీర్ వర్మ (Sudhir Verma) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘రావణాసుర’ (Ravanasura).ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాయి.
రిలీజ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎంత వీలైతే అంత ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మాస్ రాజా క్యారెక్టర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా ఇంటర్వెల్ అద్భుతంగా ఎమోషనల్ డ్రైవ్ తో ఉంటుందని.
అలాగే సినిమాలో ఈ సీక్వెన్స్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని.ముఖ్యంగా రవితేజ సెకెండ్ వేరియేషన్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది అని టాక్ బయటకు వచ్చింది.
ఇక హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తుండగా.అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా.సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రావణాసుర సినిమా రిలీజ్ కాబోతుంది.