ఏపీలో ప్రస్తుతం ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది.ఎందుకంటే ప్రస్తుతం అధికార వైసీపీలో అంతర్మథనం ఏర్పడడంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ సర్కార్( YS Jagan ) ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పడంతో ప్రస్తుతం ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్.మరి నిజంగానే జగన్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా ? ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే జగన్ కు లాభామా ? లేక నష్టమా ? అనే దానిపై ఆసక్తికరమైన డిబేట్లు సాగుతున్నాయి.

ప్రస్తుతం వైసీపీకి అనుకోని విధంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.ప్రజా వ్యతిరేకత పేళ్లుబిక్కుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీని గట్టి దేబ్బే తీశాయి.అన్నీ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని భావించిన వైసీపీ ఆశలు ఏమాత్రం నెరవేరలేదు.దీంతో వచ్చే ఎన్నికపై నిన్న మొన్నటి వరకు కాన్ఫిడెంట్ గా కనిపించిన వైసీపీ ప్రస్తుతం సందిగ్ధంలో పడింది.
మరోవైపు టీడీపీ, జనసేన పార్టీలు కూడా గట్టిగానే పుంజుకుంటున్నాయి.దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత తేలిక కాదు అనే భావనకు వైసీపీ శ్రేణులు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండడంతో ఈలోగా ప్రజా వ్యతికత మరింత పెరిగితే.175 స్థానాల్లో విజయం సాధించడం కాదు కదా గెలుపే అందని ద్రాక్ష అయ్యే అవకాశం లేకపోలేదు.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా వైసీపీ ఇప్పుడూ ముందస్తు ఎన్నికల వైపు చూస్తుందట.

అయితే గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని వైఎస్ జగన్ బృందం చెప్పుకొచ్చింది.ఇప్పుడూ మాత్రం ముందస్తు ఎన్నికల విషయంలో నోరు మెదపడం లేదు.దీంతో ఈ ఏడాది డిసెంబర్ లోగా వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.
మరి ఒకవేళ జగన్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే సర్వేలు చెబుతున్నా దాని ప్రకారం.మూడు ప్రధాన పార్టీల మద్య టాఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది.
అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన లేదా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగిన జగన్ సర్కార్ పై ఉండే ప్రజాభిప్రాయం మారదని మరికొందరి వాదన.ఆ విధంగా ఆలోచిస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగిన వైసీపీకి ఈసారి గెలుపు అంతా ఈజీ కాదనే విషయం స్పష్టమౌతోంది.
మరి ముందస్తు ఎన్నికల విషయంలో వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.