భారతీయ రైల్వే( Indian Railways ) గురించి చెప్పాలంటే ఒక్క వ్యాసం సరిపోదు.భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853లో ప్రవేశ పెట్టబడ్డాయి.స్వతంత్రం వచ్చే నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి.1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా అవతరించింది.భారత రైల్వే దూర ప్రయాణాలకు, నగరాలలో దగ్గరి ప్రయాణాలకు అవసరమైన రైళ్ళను నడుపుతోంది.రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా వ్యాపించి ఉన్నాయి అనడంలో సందేహమే లేదు.భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది.ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో భారతీయ రైల్వేలు ఒకటి.
ఈమధ్య కాలంలో చూసుకుంటే ఇక్కడ పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి.అవును, దేశంలో వివిధ ప్రాంతాలను కలిపేలా భారత రైల్వే శాఖ కొత్త రూట్లలో కొన్ని రైళ్లను తాజాగా ప్రారంభించిన సంగతి విదితమే.ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను చూసేందుకు ఇటీవలే భారత్ గౌరవ్ డెలుక్స్( Gaurav Deluxe ) అనే టూరిస్టు ట్రైన్ ఒకదానిని ప్రవేశ పెట్టింది.ఈ రైలు చూసిన వారు అవాక్కైపోతున్నారు.
ముఖ్యంగా ట్రైన్ లోపల భాగం చూసి అనుభవజ్ఞులు కధలు కధలుగా చెబుతున్నారు.
అంతేకాకుండా రైల్వే శాఖ కూడా దానికి సంబంధించినటువంటి ఓ వీడియోను విడుదల చేసింది.ఆ వీడియోలో ప్రయాణికులకు కావల్సిన అన్ని సౌకర్లు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.చిన్న లైబ్రరీ, డైనింగ్ రెస్టారెంట్ లు కూడా ఉన్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్థమే ఈ వసతులన్ని ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.ఇకపోతే ఈ ట్రైన్ 15 రోజుల పాటు టూర్లో భాగంగా మార్చి 21న ఈ టూర్ ఢిల్లీలోని సఫ్ దర్జంగా రైల్వే స్టేషన్( Saf Darjanga Railway Station ) నుంచి ప్రారంభం కానుంది.
ఈ ప్రయాణంలో అస్సాం, త్రిపురా, నాగలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలను చూపించనున్నారు.దాదాపు 156 టూరిస్టులు ప్రస్తుతం ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.