షీ టీమ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్చార్జి సూర్యాపేట డిఎస్పి పి.

 She Teams, An Awareness Conference For Students On Cyber Crime , Cyber Crime, Sh-TeluguStop.com

నాగభూషణం ఆధ్వర్యంలో తుంగతుర్తి ఎస్ఐ డానియల్ కుమార్ సహకారంతో శనివారం తుంగతుర్తి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో షీ టీమ్స్ గురించి,సైబర్ నేరాలపై అవగాహన,మానవ అక్రమ రవాణా,మహిళలు మరియు పిల్లల భద్రతపై పోలీస్ కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.పోలీస్ కళాబృందం చేత షీ టీమ్స్,మహిళల భద్రత రక్షణ,మానవ అక్రమ రవాణా,లింగ వివక్షత గురించి,100 డైల్ గురించి, సోషల్ మీడియా,ఓటిపి ఫ్రాడ్స్,సైబర్ నేరాలు,టోల్ ఫ్రీ నెంబర్ 1930,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాలు, విద్యార్థులు చెడువ్యసనాల బారినపడకుండా ఉండడం వంటి అంశాలపై ఆట, పాటల ద్వారా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుంగతుర్తి ఎస్ఐ డానియల్ కుమార్, సూర్యపేట షీ టీం ఏఎస్ఐ పాండు నాయక్,ఏఎస్ఐ రామకోటి,షీ టీం సిబ్బంది కానిస్టేబుల్ శివరాం, గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ శ్యామలత,సిబ్బంది మురారి,సైదులు,సతీష్, నరేందర్,విజయ్, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య,గోపయ్య,చారి, గురులింగం,నాగార్జున, కృష్ణ,విద్యార్థినిలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube