Shanmukh Jaswanth: ఇంకెన్ని రోజులు ఈ సింపతి వాడుకుంటావు.. షన్ను కు నెటిజన్స్ వార్నింగ్?

షణ్ముఖ్ జస్వంత్( Shanmukh Jaswanth ) యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.సోషల్ మీడియా ద్వారా పరిచయమైన షణ్ముఖ్ మొత్తానికి ఓ స్టార్ సెలబ్రెటీ హోదాను అందుకున్నాడు.

 How Many More Days Will You Use This Sympathy Netizens Comments On Shanmukh Pos-TeluguStop.com

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసి తక్కువ సమయంలో మంచి సక్సెస్ అందుకొని యూట్యూబ్ స్టార్ గా నిలిచాడు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పరిచయం పెంచుకున్నాడు.

నిజానికి ఈయన బిగ్ బాస్ లో( Bigg Boss ) చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఏకంగా తన మంచి జీవితానికి.చెరుగని మచ్చ ముద్రించుకున్నాడు.

పైగా తన అభిమానుల నుండి నెగటివ్ నిద్ర వేసుకున్నాడు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం మరో కంటెస్టెంట్ సిరి తో( Siri ) ఆయన ఎలా గడిపాడో చూసాం.

అప్పటికే ఆయన మరో సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన తో( Deepthi Sunaina ) మంచి ప్రేమ రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక వీరిద్దరూ పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.పైగా బుల్లితెరపై ప్రసారమైన పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేశారు.నిజానికి ఈ జంటని చూస్తే చాలు లవ్ చేసుకునే కపుల్స్ ఇంత క్యూట్ గా ఉంటారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారు అని కూడా వార్తలు వినిపించాయి.

కానీ షణ్ముఖ్ బిగ్ బాస్ లో సిరి తో చేసిన రాద్ధాంతం వల్ల.పూర్తిగా అతడికి దూరంగా ఉండటం మంచిది అని ఫిక్స్ అయింది దీప్తి.దీంతో అతడు హౌస్ నుండి బయటికి రాగానే అతడికి బ్రేకప్ చెప్పేసింది.

ఇక వీరి బ్రేకప్ ని చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.ఇప్పుడు ఎవరి దారి వారు అన్నట్లు బిజీ లైఫ్ లో గడుపుతున్నారు.

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటారు.అప్పుడప్పుడు ఈయన షేర్ చేసే పోస్టులు దీప్తిని ఉద్దేశించి చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈయనపై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకున్నాడు.

అందులో తన ఫోటోను పంచుకుంటూ పెయిన్ గేమ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

దీంతో అది చూసి నెటిజన్స్ అతనిపై కామెంట్లు చేస్తున్నారు.దీపు బ్రేకప్ యూజ్ చేసుకొని ఇంకెన్ని రోజులు నీ సింపతి అంటూ ఒక నెటిజన్ ఫైర్ అవ్వగా.వెంటనే మరో నెటిజన్.

అందరిదీ ఇదే ఫీలింగ్.కానీ తెలుస్తుంది వచ్చే సిరీస్ సాంగ్ రెండు పోతే అప్పుడు తెలుస్తుంది సార్ కి ఏంటో.

ఇన్స్టాగ్రామ్ లో బాధలని పోస్ట్ చేసుకుంటున్నాడు.సోషల్ మీడియా కెరీర్ కి యూజ్ చేసుకోవాలి కానీ ఇలా ఓవరాక్షన్ చేయడానికి కాదు సంవత్సరం నుండి ఇవే సింపతీలు అంటూ షన్ను కు వార్నింగ్ ఇచ్చినట్లు కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఆ కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube