అతి ఆకలి వేధిస్తుందా? అయితే ఖచ్చితంగా ఇది మీ డైట్ లో ఉండాల్సిందే!

ఆకలి అనేది అందరిలోనూ ఉండేదే.కానీ కొందరిలో మాత్రం అతి ఆకలి ఉంటుంది.

 How To Get Rid Of Excessive Hunger , Excessive Hunger, Excessive Hunger Causes,-TeluguStop.com

అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే మళ్లీ ఆకలి వేసేస్తుంటుంది.ఈ అతి ఆకలి చిన్న సమస్యగానే కనిపించిన అత్యంత ప్రమాదకరమైనది.

అతి ఆకలిని నిర్లక్ష్యం చేస్తే శరీర బ‌రువు అదుపు తప్పుతుంది.దాంతో మధుమేహం, గుండె పోటు, రక్తపోటుతో సహా వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి.

అందుకే అతి ఆకలిని నివారించుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే అతి ఆకలి పరార్ అవ్వ‌డమే కాదు వెయిట్ లాస్ కూడా అవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు బాదం పప్పులు(Almonds) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మ‌రొక‌ గిన్నెలో ఐదు న‌ల్ల ఎండు ద్రాక్షలు(Black currants), హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు, మూడు మిరియాలు, రెండు యాలకులు, రెండు టేబుల్ స్పూన్లు పచ్చ గింజలు, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు (Anise seeds)వేసుకుని ఒక గ్లాస్‌ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Telugu Tips, Latest-Telugu Health

మరుసటి రోజు నానబెట్టుకున్న బాదంపప్పును పొట్టు తొలగించి బ్లెండర్ లో వేసుకోవాలి.అలాగే మిగిలిన పదార్థాలను కూడా వాటర్ తో సహా బ్లెండర్ లో వేసుకుని ఒక గ్లాస్ ఆవు పాలు(Cow’s milk), రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన డ్రింక్ సిద్ధం అవుతుంది.ఈ డ్రింక్ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

Telugu Tips, Latest-Telugu Health

ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ డ్రింక్ ను ఒక గ్లాస్ చొప్పున ప్రతిరోజూ తీసుకుంటే అతి ఆకలి దరిదాపుల్లోకి కూడా రాదు.దాంతో చిరుతిండ్ల పై మనసు మళ్లకుండా ఉంటుంది.అదే సమయంలో మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.

హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube