ఏపీలో ప్రస్తుతం బిజెపి జనసేన మైత్రి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాగా తయారయింది.కేంద్రంతో ఉండే రాజకీయ అవసరాలతో ఇప్పటికిప్పుడు బిజెపితో దోస్తీని తెంపుకునే సాహసం జనసేనాని చేయకపోయినప్పటికీ రాష్ట్రంలో బిజెపితో మైత్రి వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమీ లేదని పవన్ కళ్యాణ్ కు అవగాహనఉంది .
అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందువల్ల పొత్త్తులపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు.అయితే పార్టీ కార్యక్రమాల లో మాత్రం బిజెపిని ఏ దశలోనూ భాగస్వామ్నిగా చేయట్లేదు.
ఉమ్మడి కార్యాచరణ అనే మాట చాలాసార్లు వినిపించినా ఆ దిశగా ఒక్క కార్యక్రమం కూడా చేసినట్టు లేదు .
అయితే కమల దళానికి మాత్రం జనసేన ను వదులుకునే ఉద్దేశం ఎంతమాత్రం లేనట్టుగా ఆ పార్టీ వాఖ్యలుచూసినప్పుడు మనకు అర్దం అవుతుంది .ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనతో తమ కాపురం బాగుందని స్టేట్మెంట్ ఇచ్చారు.వారాహి వాహన ప్రచార కార్యక్రమంలో కూడా తమతో కలిసి వెళుతున్నట్లుగా జనసేనాని స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు .ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు కూడా చేశారు….
ఇన్నాళ్లు గుర్తుకు రాని ఉద్యోగుల సమస్యలు ఉన్నఫలంగా గుర్తుకు రావటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగుతుందని ఎన్నికలు అయిపోగానే మళ్లీ ఉద్యోగులను కరివేపాకు లాగా తీసి పడేస్తుందని ఆయన విమర్శించారు.ప్రభుత్వంపై ఉద్యోగులు చేసే పోరాటాలకి బిజెపి మద్దతు ఉంటుందని తెలిపిన ఆయన తమ హక్కులు నెరవేర్చుకొవడం కోసం ఉద్యోగులు ధైర్యంగా పోరాడాలని సూచించారు ఒకప్పుడు జీతాల పెంపు కోసం ఉద్యమాలు చేసిన ఉద్యోగులను నేడు నెల జీతం కోసం రోడ్లపైకి వచ్చే విధంగా దిగజార్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంటూ ఈ ప్రభుత్వం దిగిపోవడానికి ప్రజలతోపాటు ప్రభుత్వాధికారులు కూడా నడుం కట్టాలని లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని
ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.మరి సోము వీర్రాజు చెప్పినట్లుగా జనసేన చివరి వరకు బిజెపి ప్రభుత్వంతో కలిసి ఉంటుందో ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి .ఎందుకంటే బిజెపితో కలిసిన తర్వాత జరిగిన అన్ని అన్ని ఎన్నికలలోను ఒక్కసారి కూడా జనసేన అభ్యర్థికి అవకాశం ఇవ్వని బిజెపి పట్ల జనసేన కొంత నిరసన భావంతోనే ఉందని అర్థమవుతుంది.అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో అనవసరమైన తగాదాలు ఎందుకని ప్రస్తుతం నిశ్శబ్దం వహిస్తున్నట్లుగా అర్థమవుతుంది.