నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెద్దపులి కోసం వేట కొనసాగుతోంది.పెద్దగుమ్మడాపురం గ్రామానికి సమీపంలోని ముళ్ల పొదల్లో నిన్న నాలుగు పెద్దపులి పిల్లలను గ్రామస్థులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
తరువాత వాటిని సురక్షితంగా ఫారెస్ట్ అధికారులు వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.అనంతరం తల్లి పులి కోసం గాలిస్తున్నారు.
ఈ క్రమంలో పెద్దపులి పిల్లలను ఎఫ్డీ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించనున్నారు.పెద్దపులి జాడ కోసం సమీప ప్రాంతంలో సుమారు 30 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు.