అది ఒక గ్రామం... అక్కడ ఉండేది ఒకే ఒక్క కుటుంబం... ఎక్కడంటే?

అదేంటి? ఒక గ్రామంలో ఒకే ఒక్క కుటుంబమా? అలాంటపుడు దానికి గ్రామం అని దేనికి పేరు? అనే అనుమానం వస్తుంది కదూ.మీరు విన్నది నిజమే.

 Family Of Four Living In A Tiny Village At America Kentucky Details, Village, Ma-TeluguStop.com

అయితే ఆ విషయం తెలియాలంటే ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.ఈ భూమ్మీద ఓ కుటుంబం జనసంద్రానికి దూరంగా ఓ గ్రామాన్ని నిర్మించి మరీ జీవిస్తోంది.

బాహ్య ప్రపంచానికి దూరంగా ఒక స్థలాన్ని కొని ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించుకుని మరీ బతుకుతున్నారు వారు.తల్లిదండ్రులు వేరుగా.

ఇద్దరు పిల్లలు చెరో ఇల్లును ఏర్పాటు చేసుకుని మరీ అక్కడ జీవిస్తున్నారు.అక్కడనే ఓ స్విమ్మింగ్ పూల్, కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని సంతోషంగా గడుపుతున్నారు.

ఈ ఘటన అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లండన్‌ పట్టణ సమీపంలో చోటుచేసుకుంది.మిషిగన్‌లో నివిసించే ర్యాన్‌ బ్రింక్స్‌, కెలీ ఇద్దరూ దంపతులు.వీరికి కుమార్తె లెనాక్స్‌, కుమారుడు బ్రాడీ ఉన్నారు.వారు మిషిగన్‌లోనే ప్రశాంతంగా జీవించేవారు.అయినా వారిలో ఏదో వెలితి కనిపించింది.దాంతో వారు ఆలోచన చేసారు.

పర్యావరణహితమైన విధానంలో జీవించాలన్న వారికి కోరిక కలిగింది.అంతే తడువుగా 2015లో లండన్‌ పట్టణ సమీపంలో 21 ఎకరాల భూమిని 57 వేల డాలర్లకు కొనుగోలు చేశారు.

భూముల ధరలు చౌకగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని ఎంచుకుని మరీ కొనుగోలు చేయడం విశేషం.

ఇక ఆ తరువాత కంటైనర్లతో ఇళ్లు తయారు చేసే సంస్థను ఒకదానిని సంప్రదించి 20 వేల డాలర్లు చెల్లించి తమకు కావాల్సిన సదుపాయాలతో మొతం 6 ఇళ్లను అక్కడ ఏర్పాటు చేసుకున్నారు.280 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిలో అక్కడ ర్యాన్‌ బ్రింక్స్‌, కెలీ దంపతులు జీవిస్తున్నారు.అలాగే కుమార్తె లెనాక్స్, కుమారుడు బ్రాడీ వేరు వేరుగా 160 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న 2 ఇళ్లల్లో నివాసం వుంటున్నారు.

ఐడియా అదుర్స్ కదూ! మీరు కూడా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube