చైనాపై అమెరికాకు రోజురోజుకీ అనుమానాలు ఎక్కువవుతున్నాయి?

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై చాలా నెలలు కావస్తోంది.ఈ నెల 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది పూర్తైన విషయం అందరికీ తెలిసినదే.

 Cia Director William Burns Confident On China Sending Weapons To Russia,china,am-TeluguStop.com

ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ 2 దేశాలు నువ్వా-నేనా అన్నట్లు పోరాడుతున్నాయి.ఈ క్రమంలో లెక్కలేని సంఖ్యలో ప్రాణ, ఆస్థి నష్టం జరుగుతున్నా ఏ దేశం కూడా వెనక్కి తగ్గడంలేదు.

కాగా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించే క్రమంలో ఆర్థిక, వాణిజ్య, దౌత్యం. ఇలా అన్ని రకాల సంబంధాలను తెంచుకున్నాయి.

రష్యాపై అనేక ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేసిన విషయం విదితమే.అయితే అదే సమయంలో ఉక్రెయిన్ కు ఆయా దేశాలన్నీ భారీగా యుద్ధ సామాగ్రిని అందజేస్తోన్నాయి.

రష్యా దాడిలో ధ్వంసమైన నగరాలను పునరుద్ధరించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించాయి.

Telugu America, China, International, Russia, Ukraine, William-Telugu NRI

ఇదిలా ఉండగా రష్యా, చైనా సంబంధాలపై అమెరికా సరికొత్త అనుమానాలను వ్యక్తం చేస్తోంది.రష్యాకు చైనా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.దీనికి తగిన సాక్ష్యాధారాలను కూడా సేకరించినట్లు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ విలియం బర్న్స్ తాజాగా ఓ ప్రకటనలో చెప్పారు.

ఉక్రెయిన్ లో మరింత విధ్వంసం, నరమేధాన్ని సృష్టించడానికి రష్యాకు చైనా పలు రకాల డెడ్లీ వెపన్స్ ను అందిస్తోందని అనుమానించారు.

Telugu America, China, International, Russia, Ukraine, William-Telugu NRI

అమెరికన్ మీడియా సంస్థ CBSకు ఇచ్చిన ఫేస్ ద నేషన్ వేదికగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం దీని గురించి ఆరా తీసే ప్రయత్నాలు చేస్తున్నట్టు విలియం బర్న్న్ చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధాన్ని ఆరంభించిన అనంతరం తాను కీవ్ కు వెళ్లాల్సి వచ్చిందని, అప్పుడే- రష్యా వినియోగించే ఆయుధాల గురించి తెలుసుకున్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.బెలారస్ సరిహద్దు నుంచి ఉక్రెయిన్ పై మెరుపు దాడి చేసి.కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలను రూపొందించుకున్నట్లు తమ నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube