ChatGPT… ఇపుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినబడుతోంది.ముఖ్యంగా టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది ChatGPT.
లాంఛ్ అయిన కేవలం రెండే 2 నెలలకు ChatGPT ఏకంగా 200కుపైగా పుస్తకాలు రాసి చేయితిరిగిన రచయితగా అవతరించింది అంటే మాటలు కాదు! ఈ విషయమై తాజాగా 200కు పైగా పుస్తకాలకు ChatGPTని రచయితగా అమెజాన్ బుక్ స్టోర్ లిస్టింగ్ చేసింది.అవును, మీరు ఇపుడు ఓపెన్ AI రాసిన, సహ రచయితగా ఉన్న 200కుపైగా పుస్తకాలను అమెజాన్ నుంచి ఈబుక్స్ లేదా పేపర్‌బ్యాక్ బుక్స్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఫిబ్రవరిలో అమెజాన్ కిండల్ స్టోర్‌లో ChatGPTని రచయిత, సహ రచయితగా పేర్కోవడం విశేషం.కాగా ChatGPT పేరు మీద 200కుపైగా ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయి.ChatGPTని ఉపయోగించి కంటెంట్‌ను రాయడం, క్రియేట్ చేయడం ఎలా, ది పవర్ ఆఫ్ హోం వర్క్, ఎకోస్ ఆఫ్ ది యూనివర్స్ వంటి టైటిల్స్‌తో ఈ బుక్స్ సిద్ధమయ్యాయి.అంతేకాకుండా ఇపుడు ChatGPTని రచయిత, సహ రచయితగా వెలువడే పుస్తకాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం గమనార్హం.
AI టూల్స్ గురించి సమగ్రంగా వివరించే ChatGPT on ChatGPT, AI ఎక్స్‌ప్లైన్స్ అనే మరో బుక్ పూర్తిగా ChatGPT రాయడం విశేషం.ఈ బుక్ కిండిల్‌లో ఉచితంగా అందుబాటులో ఉండగా ప్రింట్ వెర్షన్ బుక్ 11.99 డాలర్లకు మాత్రమే ఇపుడు అందుబాటులో వుంది.కాగా, తాను AI చాట్‌బాట్‌ను ఉపయోగించి బుక్ రాశానని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఫైనాన్షియల్ టెక్ కంపెనీలో పనిచేసే ప్రోడక్ట్ డిజైన్ మేనేజర్ అమ్మర్ రేషీ చెప్పగా, మనుషుల తరపున ChatGPT పుస్తకాలను రాయడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్ధితి ఆందోళనకరమని, ఇలాగైతే రచయితలు తమ ఉద్యోగాలు కోల్పోతారని ఆథర్స్ గిల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ రెసెన్‌బర్గర్ అన్నారు.