మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా లో సందడి చేస్తున్నాడు.ఆస్కార్ సన్నాహక హడావుడిలో భాగంగా గుడ్ మార్నింగ్ అమెరికా అనే ప్రత్యేకమైన కార్యక్రమం లో రామ్ చరణ్ పాల్గొన్నారు.
గతంలో సౌత్ ఇండియన్ సినిమా కి చెందిన ఏ ఒక్క స్టార్ కి ఈ ఛాన్స్ రాలేదు.రామ్ చరణ్ షో లో పాల్గొన్న సందర్భంగా చాలా హడావుడి కనిపించింది.
అమెరికా లో షో లో పాల్గొంటే ఇండియాలో సోషల్ మీడియా లో తెగ హడావుడి చేశారు ఆయన పిఆర్ టీం.అమెరికా లో రామ్ చరణ్ ని చుట్టు ముట్టిన అభిమానులు… అమెరికా లో ప్రముఖ మీడియా సంస్థలు రామ్ చరణ్ ఇంటర్వ్యూ తీసుకున్నాయని, ఆ కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించిందని రక రకాలుగా మెగా పీఆర్ టీమ్ సందడి చేయడం చూసి మీడియా లో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ చేస్తున్నది కొంతైతే.పీఆర్ టీమ్ చేస్తున్న ప్రచారం ఎక్కువ అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.ఈ మాత్రం ప్రచారం లేనిదే ఒక స్టార్ హీరో జనాల్లోకి ఎక్కువగా వెళ్లడం సాధ్యం కాదని, అందుకే ఇంతలా ప్రచారం చేస్తున్నామని వాళ్లు కామెంట్స్ చేస్తున్నారట.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తన్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం లో ఒక సినిమా చేసేందుకు గాను చరణ్ రెడీ అయ్యాడు.ఈ రెండు సినిమాలు వచ్చే సంవత్సరం లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి అనే ప్రచారం జరుగుతుంది.
శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ను ఈ సంవత్సరం లోనే విడుదల చేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.కానీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కి కానీ ఆ సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేవు అంటూ ఇటీవలే యూనిట్ సభ్యుల్లో కొందరు ఆఫ్ ది రికార్డు పేర్కొన్నారు.
ఇక సమ్మర్ లోనే బుచ్చిబాబు దర్శకత్వం లో సినిమా ను రామ్ చరణ్ మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.