ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత చిట్టిబాబు ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ తారకరత్న కూతురు నిష్క గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.తారకరత్న కుటుంబ సభ్యులు చాలా బాధ పడుతున్నారని ఆయన తెలిపారు.
తారకరత్న పుట్టినరోజు జరగాల్సిన చోట చిన్నకర్మ జరగడం ఎవరినైనా బాధ పెడుతుందని ఆయన తెలిపారు.జననం, కళ్యాణం, మరణం దేవుని చేతిలో ఉన్నాయని చిట్టిబాబు పేర్కొన్నారు.
ఈ మూడు విషయాలలో మానవ ప్రయత్నాలే కానీ మానవ నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వవని ఆయన తెలిపారు.ప్రతి పుట్టినరోజున పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవారని పిల్లలకు స్పెషల్ గా ఉండేలా తారకరత్న చూసుకునేవారని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.
తారకరత్న పుట్టినరోజు కావడంతో కూతురు నిష్క, మిగతా పిల్లలు తారకరత్న ఫోటో చూస్తూ వర్ణించలేని స్థితిలో ఉన్నారని చిట్టిబాబు వెల్లడించడం గమనార్హం.
పెద్ద పాప నిష్క వయస్సు ఎనిమిది సంవత్సరాలు అని ఆ పాప చూడటానికి పెద్దమ్మాయిలా కనిపిస్తుందని చిట్టిబాబు అన్నారు.తారకరత్న మరి కొంతకాలం జీవించి ఉంటే గ్యాప్ లేకుండా ఉండేదని ఆయన తెలిపారు.హరికృష్ణ గతంలో సమస్యలను పరిష్కరించేవారని చిట్టిబాబు పేర్కొన్నారు.
హరికృష్ణ తర్వాత బాలయ్య పెద్ద దిక్కుగా ఉన్నారని చిట్టిబాబు కామెంట్లు చేయడం గమనార్హం.
ఈ విషయాలలో బాలయ్యకు హ్యాట్సాఫ్ ఛెప్పవచ్చని చిట్టిబాబు తెలిపారు.అలేఖ్య కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.40 సంవత్సరాల వయస్సు అంటే ప్రైమ్ ఏజ్ అని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.చిట్టిబాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సెంటిమెంట్ వల్లే తారకరత్న తల్లీదండ్రులు ఆ ఇంటికి వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు.అశుభం జరిగిన సమయంలో కొత్త ఇంటికి వెళ్లడం కరెక్ట్ కాదని వాళ్లు భావించారని చిట్టిబాబు అన్నారు.చిట్టిబాబు వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.