సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో వివిధ రకాల పక్షులకు చాలా ప్రాముఖ్యత ఉంది.ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో కాకికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
శనీశ్వరుడి వాహనమైన కాకి మన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ముందే సంకేతాలను ఇస్తూ ఉంటుంది.అంతేకాకుండా చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం మన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి కాకి ఎలాంటి సంకేతాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చనిపోయిన మన పూర్వీకులకు పిండా ప్రధానాలు చేసిన తర్వాత కాకులు ఆ ఆహారాన్ని తింటూ ఉంటాయి.ఎందుకంటే మన పూర్వీకులు కాకి రూపంలో వచ్చి పిండ ప్రధానం చేసిన ఆహారాన్ని తింటాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఒకవేళ పిండ ప్రదానం చేసిన ఆహారాన్ని కాకి తినకపోతే చనిపోయిన మన పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నట్లు భావించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మనం ముఖ్యమైన పనుల మీద ఇంటి నుంచి బయటకు వెళుతున్న సమయంలో కాకి ఎదురుగా వచ్చి అరుస్తూ వెళ్లిపోతే అది శుభ సూచకంగా భావించవచ్చు.
అలా అరుస్తూ కాకి ఎదురు రావడం వల్ల మనం చేపట్టిన పనులలో విజయం వరుస్తుందని చాలామంది పెద్దలు చెబుతారు.అయితే తరచూ కాకి అరుస్తూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే అది అశుభంగా భావించాలి.ఇలా ఇంటి చుట్టూ కాకి అరుస్తూ తిరగడం వల్ల ఆ ఇంట్లో అశుభం జరుగుతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.
సాధారణంగా రోడ్డు మీద నడుచుకొని వెళ్లేటప్పుడు కాకులు కొంత మంది తలల మీద కాళ్లతో తన్నిపోతూ ఉంటాయి.అయితే మగవారికి ఇలా కాకి కళ్ళతో తనడం అనేది అశుభంగా భావించవచ్చు.
ఇలా కాకి తల పై తన్నడం వల్ల ఆ వ్యక్తి అవమానాలు పాలవుతాడు.