స్టార్ హీరో నాగార్జున హరికృష్ణ మధ్య మంచి అనుబంధం ఉండేది.వీళ్లిద్దరి కాంబినేషన్ లో పలు సినిమాలు కూడా తెరకెక్కాయి.
అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు బాలయ్య కలిసి పలు సినిమాలలో నటించారు.అక్కినేని నందమూరి ఫ్యామిలీల మధ్య కూడా మంచి అనుబంధం ఉండేది.
అయితే ఈ మధ్య కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
గతంలో బాలయ్య ఒక సందర్భంలో పరోక్షంగా అఖిల్ హీరోగా తెరకెక్కిన “అఖిల్” సినిమా గురించి సెటైర్లు వేయగా ఆ సెటైర్లు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అయితే వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అంటూ చేసిన కామెంట్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది.పాత సినిమాల గురించి బాలయ్య ప్రస్తావిస్తూ ఈ కామెంట్ చేశారు.
అయితే బాలయ్య పొరపాటున ఈ విధంగా అన్నారో కావాలని అన్నారో క్లారిటీ లేదు.

బాలయ్య చేసిన ఈ కామెంట్ల వల్ల అక్కినేని నందమూరి కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.బాలయ్య నాగ్ మధ్య విభేదాలు ఉన్నాయని చాలా సందర్భాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు కూడా నాగార్జున హాజరు కాలేదనే సంగతి తెలిసిందే.
బాలయ్య వ్యాఖ్యలపై నాగ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

బాలయ్య ఈ కామెంట్ల గురించి ఏ విధంగా వివరణ ఇస్తుందో చూడాల్సి ఉంది.బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.తెలంగాణ యాసలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.
బాలయ్య మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.