ఎమ్‌ఏ ఇంగ్లీష్ చదివి.. రోడ్డుపై ఛాయ్‌ అమ్ముకుంటున్న యువతి.. ఎందుకంటే?

ఎమ్ఏ ఇంగ్లీష్ చదివితే ఏ స్కూల్లోనైనా లేదా కాలేజీలోనైనా పాఠాలు చెబుతూ హాయిగా డబ్బులు సంపాదించవచ్చు.జర్నలిజం వైపు కూడా అడుగులు వేయొచ్చు.

 After Studying Ma English Because Of The Young Lady Selling Chai On The Road , M-TeluguStop.com

కానీ అంత చదువుకున్న ఒక యువతి మాత్రం ఎవరూ ఊహించని ఒక పని చేస్తోంది.ఈ యువతి ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.

ఆమె పేరు శర్మిష్ట ఘోష్. ఎమ్‌ఏ చేసిన తర్వాత ఆమె బ్రిటీష్ కౌన్సిల్‌లో ఉద్యోగం సంపాదించింది.

దాంతో ఆమె లైఫ్ సెటిల్ అని అందరూ అనుకున్నారు.అయితే ఎవరూ ఊహించని రీతిలో ఆమె తన ఉద్యోగానికి రిజైన్ చేసింది.

తర్వాత ఢిల్లీ కాంట్‌లోని గోపీనాథ్ బజార్‌లో టీ స్టాల్‌ను ప్రారంభించింది.దాంతో అవాక్కవడం అందరివంతయ్యింది.

ఈ యువతి తన స్టీల్ స్టాల్‌ను ఒక పాపులర్ బ్రాండ్ గా తీర్చిదిద్ది అని నగరాల్లో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.ఈమె గురించి రిటైర్డ్ ఆర్మీ అధికారి సంజయ్ ఖన్నా తన లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు.అలానే ఆమె ఫొటో కూడా పంచుకున్నారు.ఆమె ఫ్రెండ్ భావన రావు కూడా ఈ చిన్న టీ దుకాణంలో జాయింట్ పార్టనర్‌గా చేరిందని ఆయన తెలిపారు.శర్మిష్ట ఘోష్ అంత చదువు చదువుకున్నా ఆమెకు ఎప్పుడూ కూడా ఛాయ్ దుకాణం పెట్టి దానిని విస్తరించాలని కోరిక ఉండేది.ఆ కోరికను సాకారం చేసుకునేందుకే ఆమె మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకుంది.

ఈమె గురించి తెలుసుకున్న అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఒక టీ షాపు పెట్టడమే ఆమె కల అయినట్లయితే ఎమ్‌ఏ వరకు ఎందుకు చదువుకుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.మరి కొందరేమో తనకు ఉన్నత చదువులు చదవాలనే ఆశ కూడా ఉండి ఉండొచ్చు.కలలను సహకారం చేసుకునేందుకు ఏ సమయంలోనైనా ప్రయత్నాలు చేయవచ్చని మరికొందరు ఆమెకు సపోర్ట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube