ట్విట్టర్‌లో మరో నయా ఫీచర్.. వారికి మాత్రమే ఉపయోగం..

ట్విట్టర్ ఇప్పుడు బిజినెస్ యూజర్ల కోసం ‘వెరిఫికేషన్ ఫర్ ఆర్గనైజేషన్స్’ అనే ప్రోగ్రామ్‌ను తీసుకురావడానికి సిద్ధమయ్యింది.ఈ ప్రోగ్రామ్‌ ద్వారా బిజినెస్ యూజర్లు తమ అకౌంట్లను వెరిఫై చేసుకోవచ్చు.

 Twitter Planning To Launch Verification For Organizations Details, Twitter, Twit-TeluguStop.com

ఆ అకౌంట్లకు తమ ఉద్యోగులను, బ్రాండ్స్, ఇంకా గ్రూప్స్ ఇలా ఎవరినైనా కనెక్ట్ చేసుకోవచ్చు.తద్వారా వారు ట్విట్టర్‌లో స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు.

ట్విట్టర్ బిజినెస్ హ్యాండిల్ ఈ ప్రోగ్రామ్‌ ద్వారా సైన్ అప్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకునేందుకు వీలుగా ఆల్రెడీ ఒక లింక్ షేర్ చేసింది.

ఆ లింకు ద్వారా సంబంధిత వివరాలను నమోదు చేసి ఎర్లీ యాక్సెస్ పొందవచ్చు.

ఇప్పటికే ఈ ప్రోగ్రామ్స్ సేవలు సెలెక్టెడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.ఈ ప్రోగ్రామ్‌లో చేరేందుకు అనుమతి పొందిన తర్వాత సబ్‌స్క్రైబర్‌గా యూజర్లు, వారి బిజినెస్‌ మా సెల్ఫ్-సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ పోర్టల్ ద్వారా బిజినెస్ అకౌంట్స్, అనుబంధ అకౌంట్స్‌కి బ్యాడ్జ్‌లను అందుకుంటారు.

యూజర్లు బ్రాండ్ కోసం కొత్త గోల్డ్ చెక్‌మార్క్‌ను పొందుతారు.

ప్రస్తుత బ్లూ టిక్‌లు చివరికి వెరిఫైడ్ ఖాతాల నుంచి రిమూవ్ అవుతాయి.అది ఎప్పుడు జరుగుతుందనే తేదీని ట్విట్టర్ అందించలేదు, కానీ యూజర్లు తమ బిజినెస్ అకౌంట్స్ వెరిఫై చేసుకోవాలంటే ఈ కొత్త ప్రోగ్రామ్ కోసం సైన్-అప్ చేయాల్సి ఉంటుంది.ఇది బ్రాండ్ లోగోను ఉద్యోగికి, ఇతర రిలేటెడ్ ఖాతాలకు కూడా చెక్‌మార్క్ పక్కన డిస్‌ప్లే చేస్తుంది.

ట్విట్టర్ బిజినెస్ హ్యాండిల్‌ గోల్డ్ ఖరారులో ఒక టిక్ మార్క్ దాని పక్కన అది ట్విట్టర్ కి చెందిందని చూపించే ఒక బ్రాండ్ లోగోను బ్యాడ్జ్‌గా మీరు గమనించవచ్చు.ఈ కొత్త ప్రోగ్రామ్‌ ధర ఎంత అనేది ఇప్పటివరకైతే వెల్లడించలేదు.బహుశా దీని ధర 8 డాలర్లు ఉండొచ్చని అంచనా.ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించి అన్ని ఖాతాలను ఫుల్ వెరిఫికేషన్ చేసే ఈ ప్రోగ్రామ్‌ 8 డాలర్లకు అందుబాటులోకి వస్తే దానిని ఎక్కువ మంది తీసుకునే అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube