అలాంటి వారిపై ఆధారపడటం తెలివితక్కువ పని.. బిగ్ బాస్ బ్యూటీ వైరల్ కామెంట్స్!

బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి ప్రకాష్ గురించి మనందరికీ తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుని తేజస్వి ప్రకాష్.

 Tejasswi Prakash Says Women Relying Men Investments Stupid, Tejasswi Prakash, Wo-TeluguStop.com

కాగా బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటీ ని సంపాదించుకున్న తేజస్వి ప్రకాష్ ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి ప్రకాష్ మహిళల ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఆర్థికపరమైన విషయాలలో సలహాల కోసం పురుషులపై ఆధారపడే మహిళలను మూర్ఖులుగా భావిస్తున్నట్లు తెలిపింది.

Telugu Bollywood, Stupid-Movie

ఈ విషయంలో మహిళలు తగినంత స్వతంత్రంగా ఉండాల్సిన అవసరమం ఉంది అని తేజస్వి ప్రకాష్ వెల్లడించింది.జీవితంలో ప్రతి ఒక్క మహిళ సొంత నిర్ణయాలు తీసుకోవాలని ఆమె తెలిపింది.ఆర్థిక సాయం, సలహాల కోసం వేరొకరిని అడగకండి.ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకుంటే ఆ ప్రదేశానికి వెళ్లండి.ఒక మహిళగా, తల్లిగా, భార్యగా, సోదరిగా ప్రతి ఒక్కరికీ ఆ స్వాతంత్ర్యం ఉండాలి.ఎందుకంటే ఇది మహిళల ఆత్మగౌరవం సంబంధించినది.

మహిళలు పెట్టుబడులు పెట్టేందుకు పురుషులపై ఆధారపడటం తెలివి తక్కువ పనిగా నేను భావిస్తున్నాను అని తెలిపింది.ఇకపోతే తేజస్వి ప్రకాష్ కెరియర్ విషయానికి వస్తే.

Telugu Bollywood, Stupid-Movie

ప్రస్తుతం ఏక్తా కపూర్ సూపర్ నేచురల్ టీవీ షో నాగిన్ 6లో నటిస్తోంది.కాగా బిగ్ బాస్ సీజన్ 15 లోకి తేజస్వి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఆమె ఇటీవలే దుబాయ్‌లో కరణ్ కుంద్రాతో కలిసి ఓ ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది తేజస్వి ప్రకాష్.కాగా ఇంటర్వ్యూలో భాగంగా తేజస్వి ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 తేజస్వి ప్రకాష్ కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube