ప్రెజెంట్ నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లోనే పీక్స్ స్టేజ్ ను ఆస్వాదిస్తున్నాడు.అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఈయన వెనుతిరిగి చూసుకోవడం లేదు.
అఖండ తర్వాత మొదటిసారి హోస్ట్ గా చేసిన షో కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఇక ఇప్పుడు సంక్రాంతి కానుకగా బాలయ్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య వీరసింహ రెడ్డి సినిమా చేసాడు.జనవరి 12న వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయ్యింది.సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకోవడంలో బాలయ్య సక్సెస్ అవుతున్నాడు.ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లో చేరడానికి రెడీ అవుతుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కాక ముందే మరో సినిమాను లైన్లో పెట్టాడు బాలయ్య.
ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో షూట్ కూడా స్టార్ట్ చేసారు.అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యురల్ షూట్ స్టార్ట్ కాబోతుంది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించగా ఈసారి మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నాడు అని గట్టి టాక్ వినిపిస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య మరో సినిమాను ఓకే చేసాడట.మరి ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్టర్ అని తెలుస్తుంది.
ఇప్పటికే తన స్క్రిప్ట్ తో బాలయ్యను ఇంప్రెస్ చేసినట్టు టాక్.త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.
ఈ సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించ బోతున్నారట.