కోనసీమ జిల్లాలో కోడి పందాల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.పోలీసులు వర్సెస్ రాజకీయ నేతలుగా మారింది.
కోడి పందాలు నిర్వహించకుండా జిల్లా ఎస్పీ ఉక్కుపాదం మోపుతున్నారు.ఇందులో భాగంగా పందాలు జరగకుండా చర్యలను తీసుకుంటున్నారు.
మరోవైపు రాజకీయ నేతలు కోడి పందాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు పందెం బరులు నిర్వహించేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు సమావేశమై చర్చించుకున్నట్లు సమాచారం.
అయితే జిల్లాలో కోడి పందాలు జరుగుతాయా.? లేదా.? అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.