మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన తేదీ వచ్చేసింది.వాల్తేరు వీరయ్య మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది.
వీరయ్య పాత్రలో చిరంజీవి విక్రమ్ పాత్రలో రవితేజ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడం గమనార్హం.చాలా కాలం తర్వాత చిరంజీవి నట విశ్వరూపం చూశామని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి రవితేజ కాంబినేషన్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి.చిరంజీవి అభిమాని అని చెప్పుకునే బాబీ ఈ సినిమాతో నిజంగానే తాను మెగాస్టార్ అభిమానినని ప్రూవ్ చేసుకున్నారు.
కోన వెంకట్ స్క్రీన్ ప్లే బాగుంది.మైత్రీ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు.
సినిమాలోని చిరంజీవి పాత్ర కొన్ని సన్నివేశాలలో అందరివాడు సినిమాలోని గోవిందరాజులు పాత్రను గుర్తు చేసే విధంగా ఉంది.
శృతి హాసన్ రోల్ విషయంలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి, రవితేజ నటన, సాంగ్స్, బీజీఎం, చిరంజీవి ఎలివేషన్ సీన్లు, ఫస్టాఫ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. కథ, కథనంలో కొంత ల్యాగ్, సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు, రొటీన్ క్లైమాక్స్ ఈ సినిమాకు ఒకింత మైనస్ అయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి కానుకగా రిలీజైన సినిమాలలో ఈ సినిమానే బెటర్ టాక్ ను సొంతం చేసుకుంది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వాల్తేరు వీరయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.రేపు వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలు రిలీజ్ కానుండగా ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.వాల్తేరు వీరయ్య రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించి బ్రేక్ ఈవెన్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.