ఈ మధ్య కాలంలో సాధారణంగా చాలా మంది ప్రజలు ఇంట్లోనే కూర్చుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.అంతేకాకుండా చాలామంది ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటూ ఉన్నారు.
చాలామంది ప్రజల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ఆ ఫోన్ కి ఒక లింకు పంపి ఆ లింక్ ని క్లిక్ చేయగానే వారి అకౌంట్లో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి.ఇలాంటి మోసాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి.
అమెరికా కాల్ సెంటర్ స్కాంలో దోషిగా ఉన్న భారతీయుడికి స్థానిక కోర్టు 29 నెలల జైలు శిక్షను విధించింది.తప్పు చేశానని ఒప్పుకోవడంతో కోర్టు అతడికి శిక్షను ఖరారు చేసింది.
బాధితుల నుంచి దోచుకున్న డబ్బును ఇండియాలోని నిందితులకు బదిలీ చేయడంలో మోయిన్ కీలక పాత్ర పోషించే వాడని మీడియా వెల్లడించింది.
మోయిన్ 6325103 డాలర్లను బాధితులకు పరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ స్కామ్ లో మోయిన్ రన్నర్ గా వ్యవహరించాడు.ఇంకా చెప్పాలంటే ముందుగా కాల్ సెంటర్ నిర్వాహకులు అమెరికన్లకు ఫోన్లు చేసి వారి పై కేంద్ర దర్యాప్తు ప్రారంభమైంది అంటూ బెదిరించేవారు.
డబ్బును చెల్లిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు అని హెచ్చరించేవారు.దీంతో బాధితులు అందరూ వీరి మాటలకు భయపడిపోయి వారు చెప్పినట్లు నమ్మేవారు.
అయితే బాధితులు డబ్బును నిందితులు కోరిన చోటకి పార్సిల్ చేయడం వల్ల సమస్య తీరిపోతుందని చెప్పడంతో అందరూ అలానే చేసేవారు.
ఆ తర్వాత మోయిన్ నకలి ఐడి కార్డులతో పార్సిలను సేకరించేవాడు.ఈ కేసు విచారణలో అధికారులు వందల సంఖ్యలో బాధితులను గుర్తించినట్లు సమాచారం.మొయిన్ దేశ బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి.