టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం వారసుడు. ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు నిర్మాత దిల్ రాజు.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ ను మొదలు పెట్టేశారు.ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగు హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేయడంతో అది కాస్తా ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఇప్పటికే ఈ సినిమా విడుదల విషయంలో పలు కాంట్రవర్సీలు తలెత్తిన విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా సినిమా థియేటర్స్ విషయంలో వివాదాలు తెలెత్తాయి.
మొన్నటి వరకు ఆ విషయం గురించే వార్తలు సర్వత్రా చర్చలు కూడా నడిచాయి.అవి చల్లవాన్నట్లు తాజాగా మరో కాంట్రవర్సీకి తెరలేపారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.నేను విజయ్ దళపతి క్యాబిన్లో వెయిట్ చేస్తున్నాను.
క్యాబిన్ లోకి వచ్చిన విజయ్ స్వయంగా తానే మాకు కాఫీ కప్పులు ఇచ్చాడు.అప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
ఆ విషయాన్ని ఇప్పటికే మర్చిపోలేక పోతున్నాను.తెలుగులో మెగాస్టార్లు సూపర్ స్టార్లతో సినిమాలు చేశాను కానీ అటువంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు అంటూ కామెంట్స్ చేశారు.
అయితే తమిళ హీరోకి హైప్ ఇవ్వడం కోసం తెలుగు హీరోలను తక్కువ చేసి మాట్లాడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఈ వార్తపై స్పందించిన పలువురు నెటిజన్స్ దిల్ రాజు పై మండిపడుతున్నారు.తమిళ హీరో కోసం ఇలా తెలుగు హీరోలను తక్కువ చేసి మాట్లాడడం ఏమంత బాగోలేదు అని నిర్మాత దిల్ రాజు పై మండిపడుతున్నారు.మరి ఈ వార్తలపై దిల్ రాజు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.కాగా ఇప్పటికే వారీసుడు సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా సంక్రాంతికి పోటీగా విడుదల కానున్న వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి సినిమాలకు పోటీగా నిలవనుంది.
విజయ్ అభిమానులు కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.