గత కొన్నేళ్లుగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.అయితే మహేష్ కుటుంబంలో వరుస మరణాల గురించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.జాతకంలో ఉండే దోషాల వల్ల వరుస మరణాలు సంభవించాయని ఆయన అన్నారు.
2017 సంవత్సరం వరకు మహేష్ బాబు కుటుంబంలో పూజలకు సంబంధించిన కార్యక్రమాలను నేను నిర్వహించానని వేణుస్వామి తెలిపారు.2017 సంవత్సరంలో వాళ్ల కుటుంబంలో నేను వినాయక చవితి పూజలను నిర్వహించానని ఆ సమయంలో విజయనిర్మల గారు జాతకం చూడాలని అడగగా 2020 తర్వాత కుటుంబంలో వరుస మరణాలు కనిపిస్తాయని చెప్పానని ఆయన కామెంట్లు చేశారు.
తాను ఆ విధంగా మొహం మీదే చెప్పేయడంతో అప్పటినుంచి వాళ్లింట్లో జరిగిన పూజా కార్యక్రమాలకు నన్ను దూరం పెట్టడం జరిగిందని వేణుస్వామి వెల్లడించారు.
సీనియర్ నరేష్ తనతో అమ్మతో అలా అనవసరంగా ఎందుకు చెప్పారని అడిగాడని ఆయన కామెంట్లు చేశారు.
మీరు ఇలా జాతకం చెప్పడం వల్ల అమ్మ భయాందోళనకు గురవుతారని అన్నారని వేణుస్వామి పేర్కొన్నారు.ఆ తర్వాత నేను వాళ్లింట్లో అడుగుపెట్టలేదని ఆయన వెల్లడించారు.మహేష్ జాతకంలో గురు, శని గ్రహాలలో చోటు చేసుకుంటున్న మార్పులు సైతం తల్లీదండ్రులపై ప్రభావం చూపించాయని వేణుస్వామి అన్నారు.
మహేష్ ది సింహరాశి అని ఆ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ విధంగా జరిగి ఉండవచ్చని ఆయన కామెంట్లు చేశారు.చాలామంది సెలబ్రిటీల జాతకాలకు సంబంధించి వేణుస్వామి చెప్పిన విషయాలు నిజమయ్యాయి.
అందువల్ల జాతకాల విషయంలో వేణుస్వామిని నమ్మవచ్చని చాలామంది భావిస్తుండటం గమనార్హం.మహేష్ వచ్చే ఏడాది త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలతో బిజీ కానున్నారు.